రాష్ట్రీయం

శంషాబాద్‌లో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: పంద్రాగస్టు నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటం వల్ల శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు శనివారం హై అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 25 వరకు సందర్శకుల పాసుల జారీని నిలిపివేశారు. ఉగ్రదాడులు జరగొచ్చని కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు ఎయిర్‌పోర్ట్‌లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో ఆక్టోపస్ బృందాలు, సిఐఎస్‌ఎఫ్, ఇతర సాయుధ పోలీసు బలగాలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మోహరించాయి. ఎయిర్‌పోర్ట్‌లోని ముఖ్య ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు కొనసాగిస్తున్నారు. విమానాశ్రయంలోకి వెళ్లే పాస్‌లను రద్దు చేశారు. మొత్తానికి ఎయిర్‌పోర్టులో సిఆర్పీఎఫ్, ఆక్టోపస్, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పూర్తిస్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసినట్టు సైబరాబాద్ కమిషనర్ భగవత్ తెలిపారు.