రాష్ట్రీయం

వచ్చే వారం చర్చించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏపి పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ పరిధిలోని సంస్థల ఉద్యోగుల విభజనకు రంగం సిద్ధమైంది. ఈ షెడ్యూల్ పరిధిలో ఆర్టీసి, పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ, ట్రాన్స్‌కో, జెన్కో తదితర కీలకమైన సంస్థలు ఉన్నాయి. వీటి ఉద్యోగుల విభజనపై ఇంతవరకు రెండు రాష్ట్రప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ సమస్య తరచుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు దారితీస్తోంది.
రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల చొరవతో వచ్చే వారంలో 9వ షెడ్యూల్ పరిధిలోని సంస్థల ఉద్యోగుల విభజనకు కమిటీ కసరత్తు ప్రారంభించనుంది. మూడు నెలల క్రితమే రెండు రాష్ట్రాలు ఈ అంశంపై కూర్చుని మాట్లాడుకోవాలని, జటిలమైతే తాము రంగ ప్రవేశం చేస్తామని కేంద్రం కోరింది. కాని రెండు రాష్ట్రాలు ఈ సలహాను పట్టించుకోలేదు. 9వ షెడ్యూల్‌లో మొత్తం 89 సంస్థలు ఉన్నాయి. అనంతరం కేంద్రం మరో రెండు సంస్థలు కో ఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్, వడ్డెర కో ఆపరేటివ్ సొసైటీలను ఈ షెడ్యూల్‌లో చేర్చింది. దీంతో ఈ షెడ్యూల్ కింద ఉన్న సంస్థల సంఖ్య 91కు చేరింది. ఈ సంస్థల విభజనకు కేంద్రం గతంలో షీలా బేడీ కమిటీని నియమించింది. ఈ కమిటీ 61 సంస్థల ఆస్తులు, అప్పులను ఖరారు చేసింది. కాని ఉద్యోగుల విభజన పనిని పూర్తిచేయలేకపోయింది.
రెండు రాష్ట్రాలు నియమించే కమిటీ ఉద్యోగుల విభజన విధానాన్ని ఖరారు చేస్తుంది. షీలాబేడీ కమిటీ తన నివేదికలో 91 సంస్థల్లో 30 సంస్థల ఆడిట్ జరగలేదని ప్రస్తావించింది. కాగా ఏపిఎస్‌ఆర్టీసి విభజన ఇంకా జరగలేదు. పాడిపరిశ్రమాభివృద్ధిపై రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన విభేదాలు కోర్టుకు చేరాయి. ఏపి ట్రాన్స్‌కో, జెన్కో పరిస్థితి కూడా ఇంతే. తాజాగా రెండు రాష్ట్రాలు ఈ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపడంతో ఈ నెలాఖరునాటికి వివాదం లేని సంస్థల ఉద్యోగుల విభజన ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.