రాష్ట్రీయం

బిజెపి మహా సమ్మేళనానికి ఘనంగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ బిజెపి శాఖ నిర్వహిస్తున్న మహా సమ్మేళనానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం తొలిసారి తెలంగాణలో అడుగు పెడుతుండటంతో బిజెపి నాయకులు, శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ పర్యటన సందర్భంగా మోదీ 2019 ఎన్నికల్లో బిజెపిని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశా నిర్ధేశం చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా కృషి చేయాలి?, రాబోయే రోజుల్లో జాతీయ నాయకత్వం సూచించే కార్యక్రమాలు ఎలా ఉంటాయి? అనే అంశాలపై ప్రధాని లోతుగా వివరిస్తారా?, లేక రాష్ట్ర ప్రభుత్వంపై చెణుకులు విసురుతారా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రధాని రాక సందర్భంగా పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష జరిపారు. మరోవైపు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా శనివారం ప్రధాని పర్యటనపై రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ నరేంద్ర మోదీతో మాట్లాడి ఏర్పాట్లను సమీక్షించారు. అంతకుముందు దత్తాత్రేయతో పాటు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు గజ్వేల్‌లో ప్రధాని పాల్గొనే సభ ఏర్పాట్లను పరిశీలించారు.
బిజెపి రాష్ట్ర శాఖ ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొననుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్.ప్రభాకర్, నగర నాయకులు వెంకట్‌రెడ్డి, వెంకటరమణి తదితరులు పర్యవేక్షించారు. మోదీ సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గురువారం ఎల్‌బి స్టేడియంలో సుదర్శన యాగం చేయించారు.
వేదికపై ఎవరెవరు?
ఎల్‌బి స్టేడియంలో జరిగే బహిరంగ సభకు బిజెపి శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, గంగారాం హైర్, సురేష్ ప్రభు, పియూష్ గోయల్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి సహా మొత్తం 28 మంది ఈ వేదికపై ఆసీనులవుతారు. కాగా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది.
రాజకీయాలు లేవు..
సిఎస్, డిజిపిలతో సమీక్షించిన అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ, మోదీ కార్యక్రమాల్లో రాజకీయాలు లేవని, రాష్ట్భ్రావృద్ధికి వివిధ శంకుస్థాపనలు చేసేందుకు ప్రధాని వస్తున్నారని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.
ఆరేపల్లి ధర్నా, అరెస్టు..
ఇదిలావుంటే, దళితులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్ ఆ సామాజికవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ టి.పిసిసి ఎస్‌సి సెల్ నాయకుడు ఆరేపల్లి మోహన్ సారథ్యంలో కొంత మంది నాయకులు నాంపల్లిలోని బిజెపి కార్యాలయం ఎదుట ధర్నాకు ఉపక్రమించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు.

చిత్రం.. నేడు జరగనున్న బిజెపి మహా సమ్మేళనానికి సిద్ధమైన ఎల్‌బిస్టేడియం