రాష్ట్రీయం

ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గజ్వెల్, ఆగస్టు 6: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 4 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. గజ్వేల్‌లో ఇద్దరు ఐజిలు, ఇద్దరు డిఐజీలు, నలుగురు ఎస్పీలతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశామని డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. ఎన్‌ఎస్‌జీ, ఎస్పీజి దళాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయని, హైదరాబాద్‌లో నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని జోన్ల డిసిపిలు, 2 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. ఆదివారం సాయంత్రం మోదీ ఎల్‌బి నగర్ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొంటుండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. మోదీ పర్యటనను పురస్కరించుకుని నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో వాహనాలను మళ్ళించనున్నారు. మెదక్ పర్యటన భద్రత ఏర్పాట్లను హైదరాబాద్ డిఐజి అకున్ శబర్వాల్ పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చి తిరిగి వెళ్లే వరకూ పోలీసు నిఘా ఉంటుందని, నగరంలో జరిగే బహిరంగ సభకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి హెచ్చరించారు. ప్రధాని పర్యటనకు ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పులేదని, ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని డిజిపి స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో ప్రధాని పర్యటించే ప్రాంతాన్ని 9 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టారుకు ఒక ఐపిఎస్ అధికారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. గజ్వేల్‌ను కలిపే అన్ని ప్రధాన మార్గాల్లో తనిఖీలు, అనుమానితుల కదలికలపై పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది దృష్టి సారించారు. అదనపు డిజిపి అంజనీకుమార్, ఐజి నాగిరెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. ముగ్గురు ఎస్పీలు, ఏడుగురు ఎఎస్పీలు, 28 మంది డిఎస్పీలు, 78 మంది సిఐలు, మహిళా సిఐ ఒకరు, 163 మంది మహిళా ఎస్‌ఐలు, 313 మంది ఎఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 1863 మంది, ఏఆర్ కానిస్టేబుళ్లు 162 మందిని ప్రధాని పర్యటనకు బందోబస్తుగా వినియోగించనున్నారు. కోమటిబండ ప్రాంతాన్ని ఎస్‌పిజి ఆధీనంలోకి తీసుకుని అణువణువూ శోధిస్తోంది. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో అన్ని ప్రాంతాలను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలైన వేములగట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, ఎర్రవల్లి, సింగారం గ్రామాలకు చెందిన ప్రజల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ గ్రామాల్లో 144వ, సెక్షన్, 30 యాక్ట్ అమలులో ఉంది.