రాష్ట్రీయం

శ్రీశైలానికి భారీ వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 6: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. శనివారం రాత్రికి ఎగువనుంచి 1,68,764 క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా శనివారం 851.10 అడుగులకు చేరింది. జలాశయంలో 82.56 టిఎంసిల నీరు నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం 18,414 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. హంద్రీ-నీవా ద్వారా 1,050 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.