రాష్ట్రీయం

నిఘా నీడలో పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 6: కృష్ణా పుష్కరాల సందర్భంగా గతంలో ఇప్పటివరకు జరిగిన ఏ పుష్కరాల్లోను లేని విధంగా ఈ దఫా విజయవాడ నగరం సిసి కెమెరాల నిఘా నీడలోకి వెళ్లింది. రాజమండ్రి పుష్కరాల్లో చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటనలు మరోవైపు సంఘవిద్రోహులు, తీవ్రవాదుల నుంచి ముందస్తు రక్షణకై ఒక్క విజయవాడ నగరంలోనే దాదాపు 2400 పైగా సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఇప్పటికే అత్యధికం ఏర్పాటయ్యాయి. నగరంలోని ప్రతి విద్యుత్ స్తంభంపైన వీటిని ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్‌శాఖ పరంగా 1400 సిసి కెమెరాలు, నగరపాలక సంస్థ తరఫున 800 సిసి కెమెరాలు, రైల్వేశాఖ 200 సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో తీసుకుంటున్న భద్రతకు ఏ మాత్రం తీసిపోకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్టేషన్‌లోను, ఆర్మ్‌డ్ పోలీస్ గ్రౌండ్‌లోను పోలీస్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటవుతుండగా కార్పొరేషన్‌లో మరో కంట్రోల్ రూమ్ ఏర్పాటవుతోంది. వీటిని పరిశీలిస్తూ పోలీసులను అనుక్షణం అప్రమత్తం చేసేందుకు 60 వేలమందికి ప్రత్యేక సెల్ నెంబర్లతో సిమ్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికితోడు వాకీటాకీలను కూడా అందుబాట్లో ఉంచుతున్నారు. రద్దీ తక్కువగా ఉన్న ఘాట్లకు యాత్రికులను తరలించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నామని డిజిపి నండూరి సాంబశివరావు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో అన్నారు. భద్రత విషయంలో రాజీపడకుండా గట్టి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇక ఘాట్లలో ప్రతి 50 మీటర్లకు ఒక హైమాస్ట్ లైట్లతో కరెంటు స్తంభాలు ఏర్పాటయ్యాయి. ఈ స్తంభాలకు కూడా నాలుగువైపులా సిసి కెమెరాలను అమర్చారు.

చిత్రం..విజయవాడలోని ఓ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు, హైమాస్ట్ లైట్లు (ఇన్‌సెట్)