రాష్ట్రీయం

వచ్చే నెల 13 నుంచి మెయిన్స్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: ఎన్నో న్యాయ వివాదాల్లో చిక్కుకున్న 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 13 నుంచి 23 వరకూ నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్ణయించింది. శనివారం 2011 గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెల్లడించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపిపిఎస్సీ ఇప్పటికే మెయిన్స్ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. అయితే రెండు రాష్ట్రాల్లో ఒకేమారు పరీక్షలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్‌లోనే ఈ పరీక్షలనూ నిర్వహించేలా తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చర్యలు చేపట్టింది. 2011 గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణకు సంబంధించి విద్యార్థుల వివరాలు, దరఖాస్తులను తమకు అప్పగించాలని ఏపీపీఎస్సీని టిఎస్‌పిఎస్సీ కోరడం, స్పందించిన ఆంధ్ర కమిషన్‌కు వివరాలు అందించడం పూరె్తైంది. అర్హులైన అభ్యర్ధులకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లనూ ఏపీపీఎస్సీ అందించింది. పరీక్షలపై నాలుగేళ్లుగా అభ్యర్ధుల్లో నెలకొన్న ఆందోళనకు తాజా నిర్ణయంతో తెరపడనుంది. 2011లో అప్పటి ఏపీపీఎస్సీ 312 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 15/2011, జనరల్ రిక్రూట్‌మెంట్ కింద 18/2011 నోటిఫికేషన్లను జారీ చేసింది. 2012 మే 27న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. పరీక్షకు దాదాపు 1.7 లక్షల మంది హాజరయ్యారు. అనంతరం మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో 15వేల 600 మందిని ఎంపిక చేశారు. అందులో 8.6వేల మంది మెయిన్స్ పరీక్ష రాయగా, వారిలో నుంచి మెరిట్ ప్రకారం 1:2 నిష్పత్తిలో 606 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే ఈ ప్రక్రియ సాగుతున్న సమయంలో ప్రిలిమినరీ పరీక్ష కీలో ఆరు తప్పులున్నట్టు అభ్యర్థులు అభ్యంతరం లేవనెత్తారు. వాటిపై ట్రిబ్యునల్‌కు, హైకోర్టుకు, చివరకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. దాంతో ఆ ఆరు ప్రశ్నలను తొలగించి, మిగతా మార్కులతో మెరిట్ జాబితా రూపొందించి మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. 144 ప్రశ్నలతో పునర్‌మూల్యాంకనం చేయడంతో అనేకమంది అనర్హులు అని తేలగా, కొత్తగా మరికొందరు అర్హత సాధించారు. మొత్తంగా 16వేల 966 మందితో మెయిన్స్‌కు అభ్యర్ధుల జాబితా సిద్ధమైంది. అయితే తాజాగా టిఎస్‌పిఎస్సీ ప్రిలిమినరీ అభ్యర్ధుల జాబితాలను వెబ్‌సైట్‌లో ఉంచింది.