ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి పుష్కరశోభ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 7: రాజధాని అమరావతి ప్రాంతం పుష్కర శోభను సంతరించుకుంటోంది. పుష్కర పనుల్లో ఒకింత జాప్యం జరుగుతున్నప్పటికీ జిల్లాలోని ప్రాచీన శైవక్షేత్రాలతోపాటు నవ్యాంధ్ర రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లోని కృష్ణాతీరంలో నాలుగు ప్రత్యేక ఘాట్లను తీర్చిదిద్దుతున్నారు. గుంటూరు జిల్లాలోని విజయపురి సౌత్ నుంచి చిలమూరు, రేపల్లె తీరంలోని పెనుమూడి రేవు.. ఎగువన అమరావతి, ధరణికోట సీతానగరం.. ఇలా ఒక్కో ప్రాంతం సుప్రసిద్ధ శైవక్షేత్రాలుగా భాసిల్లుతున్నాయి. కృష్ణానదీ పరివాహక లంక గ్రామాల ప్రజలు పుష్కరాలను అతిపవిత్రంగా ఆరాధిస్తారు. గుంటూరు జిల్లాలో సువిశాలమైన నదీపరివాహక ప్రాంతాలు ఉన్నాయి. కృష్ణా పుష్కరాలకు జిల్లాలో 80 ఘాట్లు ఏర్పాటుచేశారు. రాజధాని ప్రతిపాదిత తుళ్లూరు మండలంలో సీడ్ కేపిటల్ ఏరియాగా ప్రకటించిన తాళ్లాయపాలెం రేవు వద్ద కిలోమీటరు మేర పుష్కర్‌ఘాట్‌తో పాటు యాగశాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రితోపాటు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇదే ఘాట్‌లో స్నానమాచరిస్తారని అంటున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా గుంటూరు జిల్లాకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్నారు. రాజధానిలో ఉండవల్లి, బోరుపాలెం, రాయపూడి, వెంకటపాలెం, తాళ్లాయపాలెం గ్రామాలు పూర్తిగా ప్రభుత్వ భవనాలు నిర్మించే ప్రాంతాలు. దీంతో ఈ ప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా అమరావతి, సీతానగరం ఘాట్లకు భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉన్నందున సుమారు రెండు కిలోమీటర్లకు పైగా ప్రత్యేక ఘాట్లను నిర్మిస్తున్నారు. కేటగిరీలవారీగా ఏ ప్లస్ ఘాట్లు 4, ఏ పరిధిలో 8, బి కేటగిరీ కింద 8 ఘాట్లు, సీ విభాగంలో మరో 57 ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే ప్రకాశం బ్యారేజీ, వారధి, లంక గ్రామాలతోపాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పొందుగలలో చేపట్టాల్సిన సౌకర్యాలపై అధికారులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. సీతానగరం సమీపంలోని కృష్ణాకెనాల్ రైల్వే హాల్ట్ వద్ద పుష్కరనగర్‌లు ఏర్పాటు చేశారు. ఈ పుష్కరాలకు జిల్లాలోని ఘాట్లను కోటి మందికి పైగా సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లకై ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. సుప్రసిద్ధ ప్రాంతాలైన అమరావతి, ధరణికోట, సీతానగరం, పెనుమూడి-పులిగడ్డ వారధి, సత్రశాల ప్రాంతాల్లో భక్తులకు తగిన వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. జిల్లాలో రూ. 900 కోట్ల మేర వివిధ ప్రభుత్వశాఖలు విస్తరణ పనులు చేపట్టాయి. అయితే వర్షాల కారణంగా పనులు సోమవారం నాటికి కూడా పూర్తికాలేదు. అమరావతి, సీతానగరం ఘాట్లలో ఇంకా ఫ్లోరింగ్ పనులు పూర్తికాలేదు. అన్ని ఘాట్లలో సీసీ కెమేరాలను అందుబాటులోకి తెస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి వరదనీరు వస్తే పనులకు ఆటంకం కలుగుతుందని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరో 48 గంటలు వాతావరణం తెరిపిస్తే పనులు పూర్తిస్థాయిలో జరుగుతాయని ఆశిస్తున్నారు. జిల్లాలోని ఘాట్ల వద్ద బందోబస్తుకు 4వేల మంది సిబ్బందిని రంగంలోకి దించాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ఉండవల్లి వద్ద వీఐపి ఘాట్‌ను కట్టుదిట్టంగా నిర్మించారు. ఏ ప్లస్ కేటగిరీ పరిధిలో ఉన్న అమరావతి, ధరణికోటకు నిత్యం రెండులక్షల మంది, తాళ్లాయపాలెం ఘాట్ కు 50వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అమరావతి, సీతానగరం ఘాట్ పనులతో పాటు రోడ్ల విస్తరణ ఇంకా పూర్తికాలేదు.

చిత్రం... సీతానగరంలో ముమ్మరంగా జరుగుతున్న ఘాట్ల పనులు