రాష్ట్రీయం

ధార్మిక పరిషత్ ఏర్పాటుపై వైఖరేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8 : దేవాలయాల పరిపాలనకు సంబంధించిన ధార్మిక పరిషత్ ఏర్పాటు, చట్టంలోని ఇతర అంశాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలియచేయాలంటూ సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. కౌంటర్ ఫైల్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చారు. దేవాలయ పాలనలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదంటూ తమిళనాడుకు చెందిన దయానంద సరస్వతి స్వామి దాఖలు చేసిన పిటీషన్‌లో ఎపి అర్చక సమాఖ్య, తెలంగాణ అర్చక సమాఖ్య, ట్రస్టీల సమాఖ్య వేసిన ఇంప్లీడింగ్ పిటీషన్లతో పాటు, ఆలయాల పరిరక్షణ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు సౌందరరాజన్ దాఖలు చేసిన ఇంటర్వీన్ పిటీషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. 33/2007 చట్టం అమలు చేసే అంశంపై ప్రభుత్వ వైఖరి ఏమిటో నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేశారు. ఈ కేసులో ప్రధానంగా ధార్మిక పరిషత్ ఏర్పాటు, 33/2007 ఎండోమెంట్ చట్టం అమలు ప్రధాన అంశాలుగా ఉన్నాయి. 33/2007 చట్టం ప్రకారం ఆలయాల నిర్వహణ బాధ్యత, పరిపాలన బాధ్యత ధార్మికపరిషత్ చేపట్టాల్సి ఉంటుంది. రాష్ట్రం విడిపోయి రెండు సంవత్సరాలు గడిచినా, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కానీ ‘్ధర్మిక పరిషత్’ను ఏర్పాటు చేయలేదు. ధార్మిక పరిషత్ ఏర్పడితే ఎండోమెంట్స్ శాఖకు అధికారాలు ఉండవన్న ఉద్దేశంతో కొంత మంది అధికారులు, ఎండోమెంట్స్ సిబ్బంది కొంత మంది కొత్త చట్టం అమలు కాకుండా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ ప్రభావం వల్ల 30/1987 దేవాదాయ చట్టానికి 2007 లో సవరణలు (33/2007) చేసినా, ఫలితం రాలేదు. వివిధ కారణాల వల్ల 33/2007 పూర్తిగా అమల్లోకి రాలేదు.
33/2007 చట్టం అమల్లోకి వస్తే దేవాలయాల పరిపాలన పూర్తిగా ధార్మిక పరిషత్తు పరిధిలోకి వస్తుంది. అర్చకులవేతనాలు, ఆలయ సిబ్బంది వేతనాలు పెరుగుతాయి. వంశపారంపర్య విధానంలో అర్చకులకు అవకాశం లభిస్తుంది. భక్తుల అభీష్టం మేరకు ఆలయాల పాలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటీషన్ వేస్తేనే వెల్లడవుతుంది.
స్వాగతిస్తున్నాం: అర్చక సమాఖ్య
దేవాదాయ చట్టం అమలుపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎపి అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎ. ఆత్రేయబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దింటి రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేస్తూ, దేవాలయాల పాలనకు ధార్మిక పరిషత్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అర్చకులకు గౌరవప్రదమైన వేతనాలు లభించాలని, చట్టం ప్రకారం అన్ని వసతులు కల్పించాలని వారు కోరారు.