రాష్ట్రీయం

బాబు బాటలో జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: తాను లక్ష్యంగా ఎంచుకున్న వారిని జాతీయ స్థాయిలో ముద్దాయిగా నిలబెట్టడంలో చంద్రబాబు గతంలో అనుసరించిన విధానానే్న వైకాపా అధినేత జగన్ ఇప్పుడు పాటిస్తున్నారు. వైఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఢిల్లీ వేదికగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించిన బాబు, అప్పట్లో జాతీయ పార్టీల మద్దతు కూడగట్టారు. ప్రస్తుతం జగన్ కూడా అదే పద్ధతి పాటిస్తున్నారు.
బాబు పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రతి కీలక ఘటనను ఢిల్లీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. పరిటాల రవి హత్య, ఓబుళాపురం మైనింగ్, పార్టీ నేతల హత్యలు, వైఎస్ అక్రమ సంపాదనపై ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పోరాటం నిర్వహించారు. అందుకు వామపక్షాలతోపాటు, బీఎస్‌పి లేదా సమాజ్‌వాదీపార్టీ, లోక్‌దళ్, జెడియు వంటి పార్టీలను సమన్వయం చేసుకునేవారు.
అందరినీ కలసి వినతి పత్రాలు ఇవ్వడం, వారితో కలిసి మీడియాతో మాట్లాడి తనకు మద్దతునిచ్చేలా చూసుకోవడంలో బాబు సఫలీకృతులయ్యారు. ప్రధానంగా వైఎస్ అవినీతిపై బాబు చేసిన పోరాటానికి జాతీయ పార్టీల మద్దతు కూడగట్టారు. రాష్టప్రతిని కూడా తరచూ కలిసేవారు. ఆ రకంగా ఏపి రాజకీయ వ్యవహారాలను ఢిల్లీ దృష్టిని ఆకర్షించడంలో బాబు విజయం సాధించారు. చివరకు సమన్యాయం చేయాలని ఏపిభవన్ వేదికగా ఆమరణ నిరాహారదీక్ష కూడా చేశారు.
ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా గతంలో బాబు నడిచిన బాటలోనే అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తాజాగా ఢిల్లీలో రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి వినతిపత్రం సమర్పించారు. ఇటీవలి కాలంలో జగన్ రాష్టప్రతిని తరచూ కలుస్తున్నారు. వామపక్ష పార్టీ నేతలు డి.రాజా, సీతారాం ఏచూరిని కలిశారు. హోదా కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. వామపక్షాలూ అంగీకరించాయి.
అదేవిధంగా బాబు రాజకీయ అవినీతిపై ముద్రించిన అవినీతి చక్రవర్తి చంద్రబాబునాయుడు పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. దానిని కేంద్రమంత్రులకు అందించారు. దేశంలో ఉన్న ప్రతి ఎంపి క్వార్టరు, ఢిల్లీలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కార్యాలయాలకు ఆ పుస్తకం చేర్చారు. ఆ రకంగా బాబు అవినీతిని జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంలో జగన్ విజయం సాధించారు. ముఖ్యంగా కేంద్రమంత్రులు ఆ సమయంలో జగన్‌కు ఎక్కువ సమయం ఇవ్వడం తెదేపా నాయకత్వానికి మింగుడుపడలేదు. హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ సహా కేంద్రమంత్రులకు ఆ పుస్తకాలు పంపిణీ చేశారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఇద్దరూ జగన్‌ను ఢిల్లీలో ప్రమోట్ చేసే బాధ్యతను స్వీకరించారు. జగన్‌కు బాబు స్థాయి అనుభవం లేకపోయినా, రాష్ట్రంలో కీలక సమస్యలయిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుతోపాటు చంద్రబాబు అవినీతిని జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు జగన్ దృష్టి సారిస్తున్నారు.