రాష్ట్రీయం

భర్తలు బతికుండగనే పెన్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: వాళ్ల భర్తలు నిక్షేపంగా బతికే ఉన్నారు. కొందరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయినా తమ భర్తలు చనిపోయారని వితంతు పెన్షన్లు తీసుకున్నారు. ఇంకొందరు సకలాంగులయినప్పటికీ, వికలాంగుల పెన్షన్లు తీసుకున్నారు. భర్త బతికుండగనే బాల్చీ తనే్నసినట్లు ధ్రువీకరణ పత్రాలు పుట్టించి, లేని వైకల్యాన్ని కొని తెచ్చుకుని ఎంచక్కా పెన్షన్ పొందుతున్న ఆ వైనం అధికారులనే ఖంగుతినిపించింది. చివరాఖరకు తేరుకుని అవి తమ సంతకాలు కావని, స్కానింగ్‌తో ఫోర్జరీ చేసినవని తెలుసుకున్నారు. రాజకీయ అధిపత్య పోరులో భాగంగా జరిగిన ఈ పెన్షన్ల మంజూరు చివరకు అడ్డదారులు తొక్కి, బతికున్న భర్తలను చంపుకునేలా చేసి, అభాసుపాలయిన వైనం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి వరకూ వెళ్లింది. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాం, వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మధ్య చాలాకాలం నుంచి ఘర్షణ, అధిపత్యపోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గత నెలలో రవికుమార్ హైదరాబాద్ వచ్చి లోకేష్ స్థాయిలో ఒత్తిడి చేసి, కొందరికి పెన్షన్లు మంజూరు చేయించారు. అంతా బాగానే ఉన్నా, ఎమ్మెల్యే సిఫారసు చేసిన లబ్థిదారుల్లో బోగస్ ఉన్నారని, బలికురవ మండలం వల్లాపల్లి గ్రామపంచాయితీ పరిథిలో 7గురు మహిళలు భర్తలు బతికే ఉన్నా వితంతు పెన్షన్లు, సకలాంగులయిన ఇద్దరు పురుషులు వికలాంగుల సర్ట్ఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నారంటూ నీటి సంఘం సభ్యుడు కాటూరి శ్రీనివాసరావు, పంచాయితీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లడంతో డొంక కదిలింది. ఇదే విషయాన్ని ఆయన లబ్ధిదారుల పెన్షన్ నెంబర్లు సహా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. గొట్టిపాటి రవి వైసీపీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగుల కుమారులకు పెన్షన్లు ఇప్పిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనితో పంచాయితీ కార్యదర్శి రంగంలోకి దిగి, మంజూరయిన పెన్షన్ల దరఖాస్తులను పరిశీలించి అవి తనవి కాదని, ఫోర్జరీ చేశారని నిర్థరించారు. ఆయనకు ముందు పనిచేసిన అధికారి కూడా అదే విషయం తేల్చి, ఇద్దరూ తమ సంతకాలు ఫోర్జరీ చేశారని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అధికారులు మంజూరు చేసిన ఏడుగురు మహిళలకు భర్తలు బతికే ఉండగా పెన్షన్ ఎలా ఇస్తారని ప్రశ్నించగా విచారణ చేస్తామని హామీతోపాటు, అవి బోగస్ పెన్షన్లంటూ కార్యదర్శులిద్దరూ స్టేట్‌మెంటు ఇచ్చినట్లు కాటూరి శ్రీనివాసరావు వెల్లడించారు.
వేలాదిమంది అర్హులైన లబ్ధిదారులు పెన్షన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటే, అన్నీ ఉన్న వారేమో రాజకీయ నేతల అండదండలతో పెన్షన్లు తీసుకుని దుర్వినియోగం చేస్తున్న ఇలాంటి ఘటనలు గ్రామాల్లో కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి.