రాష్ట్రీయం

ప్రధాని వ్యాఖ్యలతో ముస్లింలు, దళితుల్లో అభద్రతా భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: ప్రధాని మోదీ వ్యాఖ్యలతో ముస్లింలు, దళితుల్లో అభద్రతా భావం మరింత పెరిగిందని ఎఐసిసి ఎస్‌సి సెల్ చైర్మన్ కొప్పుల రాజు అన్నారు. దళితుల హక్కులను కాపాడడంలో మోదీ తన బాధ్యతను విస్మరించారని కొప్పుల రాజు మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. రెండేళ్లలో దేశంలో దళితులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నా ప్రధాని మోదీ నోరు విప్పలేదని అన్నారు. దళితులపై కాదు ముందు తనపై దాడి చేయండి అని ప్రధాని ఎల్‌బి స్టేడియంలో జరిగిన సమావేశంలో మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన తెలిపారు. కానీ దళితుల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పలేదని ఆయన విమర్శించారు. గో రక్షక్ విషయంలో చట్టంపై నమ్మకాన్ని కలిగించేలా మాట్లాడలేదని అన్నారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తప్పకుండా తీసుకుంటారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
న్యాయం జరిగే వరకు పోరాటం: ఉత్తమ్
భూ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తామని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ నిలిపి వేయడంపై సుప్రీం కోర్టుకు వెళతామని ఆన తెలిపారు.