ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ కుప్పం పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 9: కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేసి స్మార్ట్ కుప్పంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం కుప్పంలోని రోడ్లు భవనాలశాఖ అతిథి గృహంలో పలు అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. కుప్పం కోర్ కమిటీ సభ్యులతో పాటు స్మార్ట్ కుప్పం ప్రతినిధులతోను ముఖ్యమంత్రి చర్చించారు. ప్రధానంగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. త్వరలోనే కుప్పంకు హంద్రీ-నీవా కాలువ ద్వారా నీళ్లు రానున్నాయన్నారు. దీంతో కుప్పం పరిసర ప్రాంతాలు వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఈ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు పలువురు ముందుకు వస్తున్నారని, ఇక్కడ అన్ని వసతులు ఉన్న నేపథ్యంలో త్వరగా పరిశ్రమలు ఏర్పాటయ్యే దిశగా అందరూ సహకరించాలని కోరారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నేపథ్యంలో రవాణాతో పాటు పలువురికి ఉపాధి దక్కే అవకాశం ఉన్న తరుణంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు రెండంకెల అభివృద్ధిని సాధించే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఫలాలు పేదలకు అందే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజుల పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపడమే గాక ప్రధానంగా కుప్పం అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా స్థానిక నేతలందరు శ్రద్ధ చూపాలన్నారు.