రాష్ట్రీయం

తెలుగు సిగపట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా దక్కి 8 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అనేక వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది. తెలుగు భాషతో పాటు మళయాళం, కన్నడం, ఒడియా భాషలకు సైతం కేంద్ర ప్రభుత్వం ప్రాచీన భాష హోదాను కట్టబెట్టింది. తమిళంతో పాటు తెలుగు భాషకూ ప్రాచీన హోదా ఇవ్వడంపై ఆగ్రహించిన కొంత మంది చెన్నై హైకోర్టులో ఈ అంశంపై పిటిషన్ వేయడంతో హోదా అంశం ముందుకు సాగలేదు. ఎట్టకేలకు మద్రాసుహైకోర్టు తెలుగు ప్రాచీన భాష హోదాను సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అయితే దీనికి సంబంధించి తాజాగా మరో వివాదం మొదలైంది. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడంతో తెలుగు విశిష్ట భాషా కేంద్రాన్ని తమకే కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం కోరుతుండగా, తమకే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. మద్రాసు హైకోర్టులో తెలుగు భాషకు అనుకూలంగా తీర్పు వచ్చేలా అనేక రికార్డులను సిద్ధం చేసి కోర్టు ముందచడంలో ఎంతో కృషి చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆ ఖ్యాతిని క్లయిమ్ చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశిష్ట్భాషా కేంద్రం తమకే దక్కుతుందని చెబుతోంది. వాస్తవానికి విశిష్ట్భాషా కేంద్రం ఏర్పాటు చేయాలంటే రాష్ట్రప్రభుత్వం తక్షణం ఐదెకరాల స్థలంలో సొంత భవనాన్ని నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది. సొంత భవనం నిర్మించే వరకూ కనీసం లక్ష చదరపు అడుగుల అద్దె భవనాన్ని చూపించాలి. ఈ మేరకు వౌలిక సదుపాయాలు కల్పించాలని గతంలోనే మానవ వనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగానే ఉంది. దాంతో శాశ్వత భవనానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భూమిని చూపించి, బంజారా హిల్స్‌లోని లోటస్‌పాండ్ వద్ద ఆర్టు గ్యాలరీని చూపించారు. తెలుగు క్లాసికల్ లాంగ్వేజి సెంటర్‌కు నోడల్ అధికారిని కూడా మైసూర్‌లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ సంస్థ నియమించింది. కేంద్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేసినా, రాష్ట్రప్రభుత్వం తరఫున సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో కేంద్రాన్ని తాత్కాలికంగా మైసూర్‌లోని సిల్‌లోనే ఏర్పాటు చేశారు. ఇన్నాళ్ల తర్వాత మరోమారు విశిష్ట్భాషా కేంద్రం అంశం తెరమీదకు వచ్చింది.
విశిష్ట్భాషా కేంద్రం నిర్వహణకు ఏటా 20 కోట్ల నుండి గరిష్టంగా వంద కోట్ల రూపాయిల వరకూ కేటాయించనున్నారు. తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా దక్కి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇంత వరకూ ఖర్చు చేసింది రూ.10 కోట్లు కూడా దాటలేదు. కేంద్రం అనేక నోటీసులు పంపించినా, సరైన రికార్డులను సమర్పించలేదు నాటి ప్రభుత్వం. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో సిల్‌లోని తెలుగు విశిష్ట్భాషా కేంద్రం నోడల్ అధికారిని కూడా మార్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇపుడు మరో అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ ఇంత కాలం పట్టని తెలుగు రాష్ట్రాలకు రాత్రికి రాత్రి మళ్లీ విశిష్ట భాషా కేంద్రం గుర్తుకువచ్చింది. విశిష్ట భాషా కేంద్రాన్ని రెండు రాష్ట్రాల్లోనూ రెండు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఇరు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.