తెలంగాణ

పతాకావిష్కరణ మంత్రుల బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏ జిల్లాలో ఏ మంత్రి జాతీయ పతాకావిష్కరణ చేయాలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మెదక్‌లో హరీశ్‌రావు, నిజామాబాద్‌లో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర్‌రావు, కరీంనగర్‌లో ఈటెల రాజేందర్, నల్లగొండలో జగదీశ్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో జోగు రామన్న, రంగారెడ్డిలో పి మహేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో జూపల్లి కృష్ణారావు పతాకావిష్కరణ చేయనున్నట్టు పేర్కొంది. ఒక్కో జిల్లాలో ఇద్దరేసి మంత్రులు ఉండటంతో సీనియర్ మంత్రికి పతాకావిష్కరణ చేయడానికి అవకాశం దక్కింది. రాజధాని హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం జాతీయ పతకాన్ని ఎగురవేయనుండటంతో హైదరాబాద్‌కు చెందిన మంత్రులకు ఆ అవకాశం ఉండదు.