ఆంధ్రప్రదేశ్‌

అంత్య పుష్కరాలకు నేడు వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 10: గోదావరి అంత్య పుష్కరాలు గురువారంతో ముగియనున్నాయి. అంత్య పుష్కరాల్లో పదకొండో రోజు పావన గోదావరిలో పుణ్యస్నానాలతో భక్తజనం తరించారు. బుధవారం జిల్లాలో సుమారు 97 వేల మంది గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి నది అంత్య పుష్కర ఘట్టం చివరి అంకానికి చేరింది. పుష్కరుడు గోదావరి నదిలో గురువారం సంధ్యా సమయం వరకు అంటే పనె్నండు గంటల పాటే ఉంటాడు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో గోదావరిలో గురువారం పుష్కరుడికి వినూత్నంగా వీడ్కోలు పలకనున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో వీడ్కోలు పలికేందుకు భారీ ఏర్పాట్లుచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాయంత్రం ఆరు గంటలకు పురాణ ప్రాశస్థ్యం కలిగిన ప్రాచీన రాజమహేంద్రవరం నగరానికి చేరుకుని స్థానిక పుష్కర ఘాట్‌లో పుష్కరుడికి అఖండ హారతి ఇచ్చి వీడ్కోలు పలకనున్నారు. దేవాదాయ శాఖ అధీనంలో పలు ప్రసిద్ధ క్షేత్రాల్లో సేవలు అందిస్తున్న వేద పండితులు, ప్రధానంగా అన్నవరం సత్యదేవుని క్షేత్రంలోని వేదపండితులంతా పుష్కర ఘాట్ వద్ద యజ్ఞ యాగాలు నిర్వహించి పుష్కరుడికి వీడ్కోలు పలకనున్నారు. వేదంలా ఘోషించే గోదావరి నదికి వేద వచన హోరు మధ్య శాస్త్రోక్త వైభవంగా పుష్కరుడిని సాగనంపుతారు. అంతకు ముందు గౌతమీ ఘాట్ నుంచి ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదర్శన పుష్కర ఘాట్‌కు చేరుకుంటుంది. 108 మంది ముత్తయిదువులు అరటి దొప్పలతో హారతులు ఇస్తారు. పూర్ణకుంభంతో వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అఖండ గోదావరి నదిలో పుష్కరుడికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడ్కోలు పలుకుతారు . పుష్కర ఘాట్‌కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చేరుకుంటారు. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల ప్రసాద వితరణ విశేషంగా ఏర్పాటుచేశారు. కాగా బుధవారం కోటి లింగేశ్వర ఘాట్ ఒడిస్సా యాత్రికులతో రద్దీగా మారింది. గోదావరి ఒడ్డున కోటిలింగాల ఘాట్ వద్ద పితృకర్మలు విశేషంగా నిర్వహించారు. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతంలో పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్, మార్కండేయ ఘాట్, పద్మావతి, టిటిడి, శ్రద్ధానంద, మునికూడలి దైవాంశ్ ఘాట్, ధవళేశ్వరం రామపాదాలరేవు, గౌతమీ ఘాట్, సరస్వతి విఐపి ఘాట్‌లో రద్దీ కన్పించింది. అఖండ గోదావరి దిగువ నదీ పాయల మధ్య స్నానఘట్టాలైన కోటిపల్లి, అప్పనపల్లి, వాడపల్లి, అంతర్వేది, రావులపాలెం, మందపల్లి, ముక్తేశ్వరం, అయినవిల్లి, కుండలేశ్వరం, మురమళ్ళ ఘాట్లలో కూడా ఇటు పుష్కర స్నానాల్లో శ్రావణ బుధవారం పుణ్య స్నానాలు ఆచరించారు.
భద్రాచలం తీరానికి పోటెత్తిన జనం
భద్రాచలం: అంత్యపుష్కరాల్లో భాగంగా 11వ రోజు బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భద్రాచలం వద్ద గోదావరి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పుష్కర స్నానం చేశారు. ఇటీవలే మరణించిన మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు చితాభస్మాన్ని కుటుంబ సభ్యులు గోదావరిలో నిమజ్జనం చేశారు.
chitram...
రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో భక్తజన సందడి * పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు *