రాష్ట్రీయం

ఎమ్సెట్ అర్హత పరీక్ష కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: ఎమ్సెట్ కేవలం ప్రవేశపరీక్ష మాత్రమేనని, దానిని అర్హత పరీక్షగా చెప్పడం సరైంది కాదని రాష్ట్ర హైకోర్టు బుధవారం నాడు స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షను మాత్రమే అర్హత పరీక్షగా భావించాలని హైకోర్టు అధికారులకు సూచించింది. 2015 సెప్టెంబర్ 3వ తేదీన ఇచ్చిన జీవో 111లో ఎమ్సెట్‌ను అర్హత పరీక్షగా నిర్వచించడం సరైంది కాదని నెల్లూరుకు చెందిన ఆర్ జ్యోత్న్స దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన జస్టిస్ బాలసుబ్రహ్మణ్యం, జస్టిస్ అనిస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎంబిబిఎస్ కోర్సులో చేరేందుకు ఎన్‌సిసి కోటా కింద ఇచ్చిన నిబంధనల్లో అర్హత పరీక్షగా పేర్కొనడం సరైంది కాదని పిటీషనర్ వాదించారు.