రాష్ట్రీయం

పుష్కరాల్లో ‘కైజెలా’ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: కృష్ణా పుష్కరాల్లో అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ కొత్తగా రూపొందించిన కైజెలా యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ విశేషాలను ముఖ్యమంత్రి విలేఖర్లకు వివరించారు. ఈ యాప్‌ను పుష్కరాలకు వచ్చే భక్తులంతా డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుంటుంది. సుమారు రెండు కోట్ల మంది భక్తులు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీరి సమాచారం కూడా అధికారుల వద్ద ఉంటుంది. అలాగే పుష్కర విధులు నిర్వర్తించే సుమారు 60వేల మంది సిబ్బందిని యాప్‌కు అనుసంధానం చేశారు. ప్రతి ఉద్యోగి విధినిర్వహణలో ఉన్నాడా, లేదా? అన్నది ఈ యాప్ ద్వారా తెలుసుకునేందుకు వీలుంటుంది. అలాగే ముఖ్యమంత్రి, లేదా ఏ ఉన్నతాధికారైనా సిబ్బందికి త్వరితగతిన సమాచారం అందించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. కేవలం కొద్దిక్షణాల్లోనే 60వేల మందికి సమాచారం చేరుతుంది. అలాగే రద్దీ ఉన్న ప్రాంతాలకు సిబ్బందిని తరలించడానికి కూడా ఈ యాప్ సహకరిస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రజలు, సిబ్బంది తమకున్న ఇబ్బందులను అధికారులకు తెలియచేయడానికి వీలుంటుంది. ఈ యాప్ పరిధిలోకి భక్తులు వచ్చిన వెంటనే వారి స్మార్ట్ ఫోన్‌లకు మెసేజ్ వెళుతుంది. వెంటనే భక్తులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ యాప్ సక్రమంగా పనిచేయడానికి అవసరమైన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానమైన నాలుగు సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పటికే విజయవాడ నగరంలో ప్రత్యేక టవర్లు ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఉద్యోగుల వద్ద ఉన్న సిమ్‌కార్డు ఏ కారణంచేతనైనా పనిచేయకపోతే, రిలయన్స్ జియో సిమ్‌కార్డు వేసుకుని యథావిధిగా సమాచారాన్ని అందించవచ్చు. పుష్కరాల కోసం 400 వైర్‌లెస్ సెట్లను అధికారులకు అందించారు.