జాతీయ వార్తలు

‘పసిడి’ పథకంపై ఆసక్తి చూపని ఆలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: దేశంలో దాదాపు నిరుపయోగంగా పడి ఉన్న దాదాపు లక్ష కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని నగదు రూపంలోకి తీసుకు రావాలని ప్రభుత్వం కోరుకుంటుండడంతో ఇప్పుడు అందరి దృష్టీ బంగారం నిల్వలు పెద్ద ఎత్తున ఉన్న దేశంలోని ప్రముఖ ఆలయాలపైనే ఉంది. అయితే భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన బంగారు నగలను కరిగించినట్లయితే వారి మనోభావాలు దెబ్బతింటాయేమోనని చాలా దేవాలయాలు భయపడుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారును నగదుగా మార్చుకునే పథకంలో వెంటనే పాల్గొనలేమని దేశవ్యాప్తంగా ఉన్న చాలా సంపన్న, ప్రముఖ దేవాలయాల అధికారులు అంటున్నారు. మరోవైపు కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం, మహారాష్టల్రోని షిర్దీ సాయిబాబా మందిరం లాంటి కొన్ని ఆలయాల విషయంలో ప్రస్తుతం న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసులు అందుకు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ పథకం పట్ల కేరళ, కర్నాటక, తెలంగాణ, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు పెద్దగా ఆసక్తి చూపక పోగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ఆలయాలు మాత్రం కొంతమేరకు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే బంగారాన్ని కరిగించే ప్రక్రియలో విలువ తగ్గిపోవడం, అలాగే దేవుళ్లపేరిట బంగారు ఆభరణాలను కానుకలుగా ఇచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయేమోన్న భయాలను అవి వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబాలు, దేవాలయాలు లాంటి ప్రార్థనా మందిరాల వద్ద నిరుపయోగంగా పడి ఉన్న సుమారు 22 వేల టన్నుల బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకు వచ్చే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ గత నెల పసిడి ద్రరుూకరణ పథకం (గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్)ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేకాక డిపాజిట్ చేసిన బంగారానికి వడ్డీతో పాటుగా మార్కెట్‌తో ముడిపడిన పెరిగిన విలువ చెల్లిస్తారు. ఈ పథకం కింద బంగారాన్ని ఆభరణాల రూపంలో కూడా డిపాజిట్ చేయవచ్చు. అయితే వాటి స్వచ్ఛతను పరీక్షించిన తర్వాత వాటిని కరిగించి ఆ తర్వాత విలువను నిర్ధారించడం జరుగుతుంది. డిపాజిటర్లు ఆ తర్వాత తాము కోరుకున్న సమయంలో 995 స్వచ్ఛతకు సరయిన బంగారాన్ని కానీ నగదును కానీ పొందవచ్చు కానీ ఆభరణాల రూపంలో మాత్రం లభించదు. కాగా, గుజరాత్‌లోని వివిధ దేవాలయాల్లో ప్రముఖ అంబాజీ ఆలయం మాత్రం ప్రస్తుతానికి ఈ పథకం కింద తమ వద్ద బంగారాన్ని డిపాజిట్ చేసేది లేదని తేల్చి చెప్పింది. అయితే సోమనాథ్ ఆలయం మాత్రం దీనికి సంబంధించి ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దేవభూమి ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ పథకం ఆలోచించదగ్గదేనని ఆ ఆలయం ట్రస్టు కమిటీ చైర్మన్ హెచ్‌కె పటేల్ అంటున్నారు. ముంబయిలోని సుప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయం కూడా తన వద్ద ఉన్న 160 కిలోల బంగారం నిల్వలను సద్వినియోగం చేసుకునే మార్గాలను అనే్వషిస్తూ ఉన్న కారణంగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇందులో 10 కిలోల బంగారాన్ని ఆ ఆలయం ఇప్పటికే ఒక బ్యాంక్‌లో డిపాజిట్ చేసింది కూడా.
కాగా, ప్రపంచంలోనే అత్యంత సంపన్న హిందూ దేవాలయమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న తిరుమల- తిరుపతి దేవస్థానం (టిటిటి) బోర్డుకు చెందిన అత్యున్నత స్థాయి పెట్టుబడుల కమిటీ కూడా ఈ పథకం కింద బంగారాన్ని డిపాజిట్ చేసే అంశాన్ని చర్చించేందుకు త్వరలోనే సమావేశం అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి తర్వాత అత్యంత సంపన్న ఆలయమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం మాత్రం ప్రస్తుతానికి ఈ పథకం కింద తన వద్ద ఉన్న బంగారాన్ని డిపాజిట్ చేసే ఆలోచనలో లేదు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో పాలు పంచుకోవడంపై ఇప్పటివరకు ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.