రాష్ట్రీయం

ఉ.5.58 గంటలకు సిఎం పుష్కర స్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: ఆలంపూర్‌లోని పష్కర ఘాట్‌లో ముఖ్యమంత్రి దంపతులు ఉదయం 5.58కి పుణ్యస్నాన మాచరించి అధికారికంగా పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం గురువారం మధ్యహ్నమే హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌కు ప్రత్యేక బస్సులో కెసిఆర్ చేరుకున్నారు. ఆలంపూర్‌లోని పర్యాటక శాఖ అతిథి గృహం హరితలో సిఎం దంపతులు బస చేశారు. శుక్రవారం ఉదయం 5.58కు ఆలంపూర్ సమీపంలోని త్రివేణి సంగమం వద్ద గొందిమల్ల పుష్కర ఘాట్‌లో సిఎం దంపతులు పుష్కర స్నానం ఆచరించి కృష్ణమ్మకు పూజాధికాలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఏడు గంటలకు జోగులాంబ అమ్మవారిని, నవబ్రహ్మ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఏడు గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సిఎంతోపాటు ప్రత్యేక బస్సులో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ లక్ష్మారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్‌రెడ్డి బయలుదేరారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలు జరిగే మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కలిపి సుమారు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

చిత్రం..అలంపూర్ ఘాట్ వద్ద కృష్ణా జలకళను తన్మయత్వంతో చూస్తున్న కెసిఆర్