రాష్ట్రీయం

దుర్గమ్మ దర్శనం ఇలా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఆగస్టు 11: పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు ఇంద్రీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను చాలా తేలికగా దర్శించుకోవచ్చు. పున్నమి, భవానీ, పద్మావతి,సీతమ్మవారి పాదాలు, తదితర ఘాట్‌ల్లో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు కెనాల్‌రోడ్ వినాయకుడి వద్ద నుండి ప్రారంభం అయ్యే క్యూమార్గంలోనికి ప్రవేశించి రధం సెంటర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లోక్‌రూమ్‌లో సామానులు భద్రపర్చుకొని ఇదే క్యూమార్గంలో ఘాట్‌రోడ్ మీదుగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని మల్లిఖార్జున మహామండపం మెట్లమార్గం, మల్లేశ్వరస్వామివార్ల మార్గం, ఈరెండు మార్గాల గుండా మల్లిఖార్జునపేట సెంటర్‌కు చేరుకోవచ్చు. మహామండపంలో ఏర్పాటు చేసిన 10 ప్రసాదాల కౌంటర్‌ల్లో అమ్మవారి మహాప్రసాదాలను కొనుగోలు చేసుకోవచ్చు. ఇదేరోడ్ గుండా కిందకు వచ్చి దుర్గగుడి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నిత్యాఅన్నదాన పధకంలో అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించచ్చు. పున్నమిఘాట్,్భవానీపురం ఘాట్స్‌ల్లో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి కుమ్మరి పాలెం సెంటర్ నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూమార్గంలోనికి ప్రవేశించి దుర్గగుడి టోల్‌గేట్ వద్దకు చేరుకొంటే అక్కడ నుండి ఈక్యూమార్గాన్ని కొండపైకి వెళ్ళే క్యూమార్గంలోనికి కలుపుతారు. ఈమార్గం గుండా ఈభక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు. రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్ నుండి ప్రతి ఐదునిమిషాలకు వివిధ ఘాట్ వద్దకు తీసుకువెళ్ళేందుకు ఆర్టీసీ బస్‌లను ఏర్పాటు చేసారు. సాధారణ భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోనేవిధంగా దుర్గగుడి ఇవోఎ సూర్యకుమారి ఈసంవత్సరం ప్రత్యేకంగా రోజుకు 22గంటలపాటు అమ్మవారిని దర్శించుకోనే అవకాశం భక్తులకు ఏర్పాటు చేసారు. విఐపిలు సైతం అందరికి ముఖమండప దర్శనం మాత్రమే అనుమతించారు. రోజుకు 2లక్షలమంది భక్తులు వచ్చిన ఎటువంటి అసౌకర్యం లేకుండా దుర్గగుడి అధికారులు ఏర్పాట్లు చేసారు. సుమారు 5కిలోమీటర్లు దూరం భక్తులు నడిస్తే ఎటువంటి సిఫారస్‌లు లేకుండా చక్కటి వాతావరణంలో ఆధ్యాత్మిక చింతనతో అమ్మవారిని దర్శించుకొని ఆమె అశీస్సులను పొందవచ్చు.