రాష్ట్రీయం

శ్రీశైలంలో దర్శన, స్నానాల సమయాలివే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 11 : కృష్ణా పుష్కరాల సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం 20 గంటల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఆలయం తెల్లవారుజామున 4 నుంచి అర్ధరాత్రి 12గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు. ఇక పాతాళగంగ, లింగాలగట్టులో ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకూ భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు సమయం నిర్ణయించారు. పుష్కరఘాట్‌ల వద్దే పెద్దలకు పిండ ప్రదానం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయగా పూజా సామగ్రి విక్రయించేందుకు పొదుపు గ్రూపు మహిళలకు అనుమతులు మంజూరు చేశారు. కాగా సప్తనదీ సంగమేశ్వర ఆలయం వద్ద పుష్కర స్నానమాచరించడానికి ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకూ అనుమతిస్తారు. శ్రీ లలితా సంగమేశ్వర పురాతన ఆలయం నీటిలో మునిగిపోవడంతో ఎగువన నిర్మించిన ఆలయంలో ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకూ దర్శన అవకాశం కల్పించారు. పిండ ప్రదానం ఏర్పాట్లు, పూజాధికాలు నిర్వహించడానికి స్నానపు ఘాట్లలో భక్తులు స్నానాలకు వచ్చే సమయానికి సిద్ధంగా ఉంటారు. కాగా సంగమేశ్వరం వద్ద విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, వలంటీర్లు మాత్రమే రాత్రి బస చేస్తారని భక్తులు సమీపంలోని పుష్కర నగర్‌లు, ఆత్మకూరు లాడ్జీలలో బస చేయాల్సిందేనని పేర్కొంటున్నారు.