రాష్ట్రీయం

దాడి అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఆగస్టు 12: తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి పంచాయతీ సూదాపాలెంలో కులవృత్తి చేసుకుంటున్న దళితులపై దాడిచేయడం అమానుషమని, బాధితులను చంద్రబాబు పరామర్శించకపోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అమలాపురంలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం దాడికి గురైన బాధితులకు లక్ష నుండి రూ.8.25 లక్షలు వరకూ చెల్లించవచ్చని, అయితే చంద్రబాబు ప్రభుత్వం కేవలం లక్ష రూపాయలే చెల్లించి చేతులు దులుపుకుందన్నారు. రాజమండ్రి వచ్చిన చంద్రబాబు కేవలం 60 కిలోమీటర్లు ప్రయాణించి బాధితులను పరామర్శించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు పరామర్శించి ఉంటే బాధితులకు మనోధైర్యం కలిగి త్వరగా కోలుకునేవారన్నారు. అంతేకాకుండా దాడులకు పాల్పడేవారికి భయం కలిగేదన్నారు. కేవలం దళితులపై చంద్రబాబుకు కపటప్రేమ తప్ప మరేమీ కాదని ఈ సంఘటన రుజువుచేసిందని జగన్ విమర్శించారు. ఈ ఘటన హోం మంత్రి సొంత మండలంలో జరగడం మరీ దారుణమన్నారు. దళితుల పక్షాన పోరాడేందుకు తమ పార్టీ ముందు వరసలో ఉంటుందని జగన్ పేర్కొన్నారు. జగన్ వెంట వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ పిల్లి సుబాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి తదితరులు ఉన్నారు.

చిత్రం... బాధితుడు ఏలీషాను పరామర్శిస్తున్న జగన్