ఆంధ్రప్రదేశ్‌

మరింత అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 12: పవిత్ర కృష్ణా నదీ పుష్కరాలు ఆరంభమయ్యాయి. ఇది ప్రారంభం మాత్రమే. మిగిలిన 11 రోజులు అధికారులు మరింత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు తరలి వస్తున్న భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి అఖండ హారతి, కృష్ణ పవిత్ర హారతి చరిత్రలో నిలిచిపోవాలని ఆయన సూచించారు. కృష్ణ వద్ద గురువారం నిర్వహించిన పవిత్ర హారతి తనకెంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. గోదావరి అఖండ హారతి ఇచ్చి, వెనువెంటనే కృష్ణలో పవిత్ర హారతి ఇవ్వడం తన జీవితంలో మరిచిపోలేనని చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేస్తే అద్భుతాలము సృష్టించవచ్చని కృష్ణ పవిత్ర హారతి రుజువు చేసిందని అన్నారు. కృష్ణా పుష్కరాలకు ప్రతి రోజు లక్షలాదిమంది యాత్రికులు తరలి వస్తున్నందున, 170 ఘాట్‌లు సిద్ధంగా ఉంచామని చంద్రబాబు చెప్పారు. ప్రతి రోజు ఉదయం నుంచే కంట్రోలు రూంలో నుంచి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తానని, పుష్కర ఘాట్‌లను స్వయంగా సందర్శిస్తానని చంద్రబాబు చెప్పారు. ఎక్కడా ఎటువంటి లోపం జరగరాదని ఆయన అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్, పారిశుధ్యం, వైద్యం, బందోబస్తు పగడ్బందీగా ఉండాలని ఆదేశించారు. పుష్కర భక్తులకు తాగునీరు, ఆహారం ఎప్పటికప్పుడు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆహారం, బస, రవాణా సమాచారం అందించడంలో విద్యార్థుల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే పుష్కరాల్లో సేవలిందించేందుకు వచ్చిన 12 వేల మంది విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని సిఎం సూచించారు. కొన్ని ఘాట్‌లలోకి యాత్రికులను అనుమతించడం లేదని, పిండ ప్రదానానికి సదుపాయాలు లేవని తెలిసిన సిఎం వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
అలా ‘సెట్’ చేశారు..!
విజయవాడ (క్రైం): నగర పోలీసుశాఖ నిర్మించిన ‘ఆపరేషన్ కమాండ్ కంట్రోల్’ సాంకేతిక ప్రపంచానికే తలమానికంగా నిలుస్తోంది. పుష్కరాల నేపధ్యంలో నగర పోలీసుశాఖ చేపట్టిన భద్రతా ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ పుష్కరాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఒడిసి పట్టుకుంటోంది. దీంతో పోలీసు గుప్పిట్లోకి విస్తృత స్థాయిలో సిసి కెమేరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుత పుష్కరాల సందర్భంగా ఈ వ్యవస్థ అనివార్యమైనప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూడా దీన్ని వినియోగించనున్నారు. ఇక్కడ 16 స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పుష్కర ప్రాంతాలతోపాటు, ఇంతకుముందే నగరంలో ప్రధాన కూడళ్ళల్లో ఏర్పాటు చేసిన సిసి కెమేరాల నుంచి నేరుగా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. కిలోమీటర్ల దూరంలో ఆయా చోట్ల పరిస్థితులను కళ్ళ ముందు సాక్షాత్కరమవుతుంది. ప్రతికూల పరిస్ధితులు గుర్తించగానే.. వెంటనే ఇక్కడ సిబ్బంది ఆయా చోట్ల ఉన్న యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి చర్యలు చేపడతారు. ఇదిలావుండగా.. ప్రధాన స్క్రీన్‌లకు ఒకవైపు నాలుగు, మరోవైపు డ్రోన్ కెమెరాలకు సంబంధించిన మరో నాలుగు డిస్‌ప్లే స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఘాట్‌ల్లో నిర్ణీత సామర్థ్యం కన్నా రద్దీ పెరిగితే వెంటనే అక్కడి నుంచి సంకేతాలు కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు చేరుకోవడం ద్వారా అదనపు స్క్రీన్‌లో మార్కింగ్ కనపడుతుంది.
జల్లు స్నానమే శరణ్యం!
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఆగస్టు 12: కృష్ణా పుష్కరాలు ఒకరికి మోదం.. మరొకరి ఖేదాన్ని నింపుతున్నాయి.. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని ఘాట్లలో నీరు పుష్కలంగా ప్రవహిస్తున్నా భక్తులు స్నానఘట్టాలకు చేరుకోలేదు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా డెల్టాకు నీరు నిలుపుదల చేయటంతో పవిత్ర స్నానాలకు భక్తులు అనేక ఇబ్బందులుపడ్డారు. దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, రేపల్లె కరకట్ట తీరంలో ఏ ఘాట్లలో చుక్క నీటిని వదలలేదు. దీంతో నదిలో కిలోమీటరు దూరంలో ఉన్న మడుగుల వద్దకు చేరుకుని కొందరు స్నానాలు చేశారు. కాగా చిలుమూరు, వల్లభాపురం, కొల్లిపర, వెల్లటూరు తదితర ప్రాంతాలతో పాటు పల్నాడు ప్రాంతంలోని అచ్చంపేట, విజయపురిసౌత్ పరిధిలోని అనుకు, దేశాలమ్మగుడి ఘాట్, పుష్కరవేణి ప్రాంతాల్లో ఇంజన్ల ద్వారా నీటిని తోడించి షవర్‌బాత్‌లు ఏర్పాటు చేశారు. వాటితోనే తల తడుపుకుని భక్తులు పుష్కరస్నానం ముగించుకోవాల్సి వచ్చింది. జల్లు స్నానాలుగా గ్రామీణుల వాడుకలో ఉన్న షవర్‌ల నుంచి కూడా నీరు అంతంతమాత్రంగా అందుతోంది.