తెలంగాణ

నల్లగొండ జిల్లాలో లాంఛనంగా పుష్కరోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 12: నల్లగొండ జిల్లాలో కృష్ణా పుష్కర ఘట్టం శుక్రవారం తెల్లవారుజామున 5.58 గంటలకు వేద పండితుల నదీ పూజలు, హారతులతో వైభవంగా ఆరంభమైంది. జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి, కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి సతీ సమేతంగా మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చెంతన ప్రహ్లాద ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరించి వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య లాంఛనంగా పుష్కరోత్సవాలను ప్రారంభించారు. వాడపల్లి, మట్టపల్లి, నాగార్జున సాగర్ పుష్కర ఘాట్‌లలో పుష్కర స్నానాలకు భక్తులు తరలివచ్చారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 50 వేల మంది మాత్రమే పుష్కర స్నానాలు చేసి ఉంటారని అధికారుల అంచనా. వాడపల్లిలో ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎన్.్భస్కర్‌రావులు, నాగార్జున సాగర్‌లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాచరాజుపల్లిలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌లు పుష్కరాలను ప్రారంభించి పుష్కర స్నానాలు చేశారు. డిజిపి అనురాగ్‌శర్మ హెలికాప్టర్ ద్వారా నాగార్జున సాగర్ చేరుకుని పుష్కర ఘాట్‌ల వద్ధ బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లాలో కోటిన్నర మంది భక్తులు పుష్కర స్నానాలకు వస్తారన్న అంచనాతో ప్రభుత్వం తొమ్మిది మండలాల పరిధిలో 28 పుష్కర ఘాట్‌లు ఏర్పాటు చేసింది. అయతే ఎనిమిది ఘాట్లలో నీరు అందుబాటులో లేకపోవడంతో అక్కడ భక్తులు జల్లు స్నానాలకే పరిమితమయ్యారు. ప్రసిద్ధ ఆలయాలకు, పర్యాటక స్థలాలకు నెలవుగా ఉన్న మట్టపల్లి, వాడపల్లి, నాగార్జున సాగర్, అడవిదేవులపల్లి తదితర ప్రాంతాలకు రానున్న రోజుల్లో భక్తుల రద్ధీ పెరుగతుందని భావిస్తున్నారు. పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం పుష్కర ఘాట్‌కు తొలిరోజు అనూహ్యంగా వేల సంఖ్యలో భక్తులు తరలిరావడం విశేషం. మంత్రి జి.జగదీష్‌రెడ్డి దంపతులు ఈ ఈ ఘాట్‌ను కూడా సందర్శించి పూజలు నిర్వహించారు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ పరిధిలోని చందంపేట మండలం కాచరాజుపల్లి, పెద్దమునిగాల్, ఉట్లపల్లి, పొట్టిచెల్మ, పిఏపల్లి అజ్మాపురం ఘాట్‌లకు కృష్ణా జలాలు దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉండిపోవడంతో అక్కడ జల్లు స్నానాలకు ఇష్టపడని భక్తులు ఇతర ఘాట్లకు తరలిపోతున్నారు. కనగల్ వాగు, ధర్వేశిపురంలో ఎఎమ్మార్పీ ఎత్తిపోతల నీరందలేదు. ఇక్కడ జల్లు స్నానాలకు సైతం నీరు కరవైంది. మేళ్లచెర్వు మండలం కిష్టాపురం, వజినేపల్లి, బుగ్గమాదారం ఘాట్లలో రక్షణ కంచేకు ఆవలివైపు నుంచే కృష్ణా జలాలు సాగిపోతుండటంతో భక్తులు నిరాశగా వెనుతిరుగుతున్నారు.
మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ నియంత్రణకు దేవాలయాలు, ఘాట్లలో 6,785 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వరితస్తున్నారు. సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో భక్తుల రద్ధీని పర్యవేక్షిస్తున్నారు.