రాష్ట్రీయం

శాంతి, సౌభాగ్యాలతో రాష్ట్రం విలసిల్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 12 : ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో విరసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా సకాలంలో వర్షాలు కురిసి పచ్చని పంటలు పండాలని, ప్రమాదాలకు తావులేకుండా ప్రజలకు నిండు జీవితం ప్రసాదించాలని మూడున్నర కోట్ల దేవతలు, బృహస్పతితో కలిసి కృష్ణా నదీమ తల్లిలోకి వచ్చిన పుష్కరుడు ఆశీర్వదించాలని కృష్ణా పుష్కర ప్రారంభ పూజల్లో వేద పండితులు మహా సంకల్పం నిర్వహించారు. పుష్కర స్నానం చేసి భక్తులు నిర్వహించే పూజలు, చేసే దానాలు సత్ఫలితాలు ఇవ్వాలంటూ వేద పండితులు పుష్కరుడిని ప్రార్థించారు. శ్రీశైలం, సంగమేశ్వరంలలో శుక్రవారం కృష్ణా పుష్కరాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. శ్రీశైలం మహాక్షేత్రంలో పుష్కర ప్రారంభ ఘడియల్లో శ్రీశైల జగద్గురు మఠం పీఠాధిపతి శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్యస్వాములు, కలెక్టర్ విజయమోహన్ దంపతులు, శ్రీశైలం దేవస్థానం ఇఓ నారాయణ భరత్‌గుప్త దంపతులు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొనగా వేద పండితులు ప్రధాన రాజగోపురం ముందు భాగంలో కృష్ణమ్మ తల్లికి సమర్పించే సారె, పూజా ద్రవ్యాలు, సుందరంగా అలంకరించిన కలశాలకు పూజాధికాలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలతో ఆలయ వీధుల్లో ఊరేగింపుగా మెట్ల మార్గంలో పాతాళగంగకు చేరుకున్నారు. అక్కడ నదీమ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కృష్ణవేణికి సారె సమర్పించారు. అనంతరం మహా సంకల్పం నిర్వహించి తెల్లవారుజామున 5.54 గంటలకు పుష్కర స్నానం చేశారు. ఆ తరువాత పుష్కర జలాలతో పాతాళేశ్వరస్వామి, నంది మండపంలోని నందీశ్వరస్వామి, బయలు వీరభద్రస్వామికి ప్రదక్షిణలు నిర్వహించి ప్రధాన ఆలయంలోని శ్రీశైల మల్లికార్జునుడికి పుష్కర జలాలతో అభిషేకం చేశారు.భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సప్తనదీ సంగమేశ్వరంలోని శ్రీ లలితా సంగమేశ్వర ఆలయంలో ఆలయ పూజారి తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విజయవాడలో సిఎం దంపతుల గోపూజ