ఆంధ్రప్రదేశ్‌

దేన్నీ సాఫీగా సాగనివ్వరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 13: ‘ఒకాయనకు పుష్కరాలు సాఫీగా, విజయవంతంగా జరగటం ఇష్టం లేదు. రేపో మాపో మరో అవాంతరం సృష్టించినా ఆశ్చర్యపోవలసిన పని లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్ష నేత జగన్‌పై ధ్వజమెత్తారు. ‘గతంలో పట్టిసీమ ప్రాజెక్టుకు అడ్డుపడ్డాడు. ఇప్పుడు పోలవరం నిర్వాసితుల్ని రెచ్చగొడుతున్నాడు. మరోవైపు రాజధాని నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ప్రచారం చేస్తున్నాడు. కోర్టులో కేసులు వేయిస్తున్నాడు’ అని విమర్శించారు. మనుషుల్లో పాజిటివ్ థింకింగ్ పెరగాలన్నారు. ఈ సందర్భంగా మీలోనూ కొందరు ఉన్మాదులు ఉన్నారంటూ మీడియాలో ఒక వర్గం గురించి వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతి జరుగుతున్నదంటూ సీనియర్ జర్నలిస్టు ఎబికె ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
‘కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కొన్ని మాసాలుగా రేయింబవళ్లు శ్రమిస్తున్నాం. పుష్కర స్నానాలకు నీరు వచ్చేలా చర్యలు చేపట్టాం. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపడుతున్నాం. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లతో యాత్రికులు తరలివస్తున్నారు. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు. పుష్కర ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ రూమ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఎం మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లను స్మార్ట్ స్క్రీన్లపై ముఖ్యమంత్రి వివరించారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదివారం నుంచి అన్ని ఘాట్లలో మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు.
గోదావరి జలాల కలయికతో కృష్ణ నీరు కలుషితమవుతున్నదంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా కొట్టిపారేస్తూ అందులో వాస్తవం లేదన్నారు. కృష్ణా జలాలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నామన్నారు. పద్మావతి పుష్కర ఘాట్‌లో ఏడేళ్ల బాలుడు కిరణ్‌కుమార్ మృతి చెందటంపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడున్న సిసి కెమెరాల ద్వారా ఆ బాలుడు నీళ్ల దగ్గరకు ఎలా వెళ్లిందీ, ప్రమాదవశాత్తూ ఎలా పడి చనిపోయిందీ విజువల్స్ చూపించారు. తల్లిదండ్రులు, చుట్టుపక్కలవారు పట్టించుకోకపోవటం దురదృష్టకరమన్నారు.