ఆంధ్రప్రదేశ్‌

పంద్రాగస్టు వేడుకలకు అనంత ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 13: రాష్టస్థ్రాయి 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు అనంతపురం నగరం ముస్తాబైంది. ఈనెల 15న అనంతపురం నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియం(పిటిసి)లో అంగరంగ వైభవంగా జెండా పండుగ నిర్వహించనున్నారు. గత 15 రోజులుగా కలెక్టర్ కోన శశిధర్ పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఏర్పాట్లలో అన్నిశాఖల అధికారులు భాగస్వాములయ్యారు. వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన 53 మంది అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. స్వాతంత్య్ర వేడుకలకు ప్రభుత్వం సుమారు రూ.3 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో పిటిసిని ఆధునీకరించారు. నగరంలోని పలు ప్రభుత్వ భవనాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కూడళ్లు, నాయకుల విగ్రహాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ముఖ్య అతిథిగా సిఎం చంద్రబాబు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 14వ తేదీ సాయంత్రం అనంతపురం చేరుకుంటారు. 15న ఉదయం 9 గంటలకు పిటిసి స్టేడియంలో జాతీయ పతాకం ఆవిష్కరిస్తారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అదే విధంగా పోలీసు, అగ్నిమాపకశాఖలకు చెందిన 12 మందికి మెడల్డ్ బహూకరిస్తారు. వేడుకల్లో పాల్గొంటున్న సుమారు 400 మందికిపైగా ఆర్డ్మ్, నాన్ ఆర్డ్మ్ కంటింజెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థినీ విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్ట్ఫికెట్లు సిఎం అందజేస్తారు. అనంతపురం రేంజ్ డిఐజి ప్రభాకరరావు, జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు నిరంతరం శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన అనంతపురం నగరంలోని పిటిసి మైదానం

పెళ్లికి ముందురోజే..
వరుడి ఆత్మహత్య
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఆగస్టు 13: మరికొద్ది గంటల్లో పెళ్లనగా వరుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా పెండ్లిమర్రికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మల్లికార్జునరెడ్డి(28) శుక్రవారం రాత్రి కడపలోని యోగివేమన యూనివర్సిటీ ప్రాంగణంలో వేపచెట్టుకు ఉరివేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పెండ్లిమర్రి మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన వెన్నపూస పిచ్చిరెడ్డి రెండవ కుమారుడు వి.మల్లికార్జునరెడ్డికి వీరపునాయునిపల్లె మండలం సంగాలపల్లెగ్రామానికి చెందిన వీరభాస్కర్‌రెడ్డి కుమార్తె శ్రీవాణిదేవితో ఇటీవల వివాహ నిశ్చితార్థం జరిగింది. వీరికి ఆదివారం ఉదయం 7.15 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. బెంగళూరులోని టిసిఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మల్లికార్జునరెడ్డి గురువారం స్వగ్రామం చేరుకున్నాడు.
కడపకు వెళ్లి వస్తానని శుక్రవారం ఉదయం వెళ్లిన మల్లికార్జునరెడ్డి రాత్రయినా రాకపోవడం, సెల్‌ఫోన్ పనిచేయకపోవడంతో బంధువులు, గ్రామస్తులు ఆరా తీశారు. కడపలోని యోగివేమన యూనివర్సిటీలోచెట్టుకు ఉరివేసుకున్న మల్లికార్జునరెడ్డి కనిపించాడు. దీంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వరుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.