ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం అసాధ్యమేనని, అయితే ప్రత్యేక హోదా కన్నా మెరుగైన సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి బిజెపి నేత పురంధ్రీశ్వరి స్పష్టం చేశారు.
శనివారం చిత్తూరులో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కొన్ని సాంకేతిక సమస్యలు వున్నందువల్ల ఈ హోదా కల్పించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నాయని, ఈ రాష్ట్రాలను ఒప్పిస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం సిద్దమేనని తెలిపారు. ఈదిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ చూపితే ఆంధ్రప్రదేశ్ తోపాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దక్కే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత స్థానం కల్పించడానికి ప్రధాని అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్భ్రావృద్ధికి దోహద పడటానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యా వైద్యరంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సముచిత స్థానం కల్పించిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కొందరు అవగాహన లేకుండా కేంద్రంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా కేంద్రం నాబార్డు ద్వారా నాలుగు వేల కోట్లను కేటాయించిందని. ఈనిధులు పూర్తిగా కేంద్రమే భరిస్తుందన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదన్నారు. హోదా విషయంలో అనేక సాంకేతిక సమస్యలు వున్న విషయాన్ని అందరూ గుర్తించి రాష్ట్భ్రావృద్ధికి ఏమి కావాలో అదిశగా ప్రయత్నిస్తే మంచిదని సూచించారు.