రాష్ట్రీయం

ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌లో అంతర్భాగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: ఆక్రమిత కాశ్మీర్ సైతం భారత్‌లో అంతర్భాగమేనని కేంద్ర సమాచార మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జోరందుకున్నాయని, ప్రధాని నరేంద్రమోదీ సంస్కరణలను వేగవంతం చేశారని దేశ ఆర్థిక వ్యవస్థకు జిఎస్‌టి బిల్లు పెద్ద అండగా ఉంటుందని వెంకయ్య నాయుడు చెప్పారు. ‘్భరత్ అభివృద్ధి, పురోగతిలో మీడియా పాత్ర ’ అనే అంశంపై ఐఎస్‌బిలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అధికారుల మిడ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సు జరిగింది. ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రగతి రథచక్రంలో సమాచార ప్రసార వ్యవస్థను ఒక కీలక అంశంగా భావిస్తోందని అన్నారు. గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోందని చెప్పారు. స్వచ్ఛ భారత్ అభియాన్ విజయవంతం కావడంలో సమాచార వ్యవస్థ పాత్ర చాలా గొప్పదని అన్నారు. పాత కమ్యూనికేషన్ మాధ్యమాలకు కాలం చెల్లిందని భావించకూడదని, ఆకాశవాణికి విస్తృత జనబాహుళ్యం వద్దకు చేరుకునే శక్తి ఇప్పటికీ ఉందని అన్నారు. ప్రజల ప్రతిస్పందనలను ‘మైగవ్’ వేదిక ద్వారా తెలుసుకోవడం సాధ్యపడుతోందని అన్నారు.
ప్రజల ఆలోచనా తీరులో మార్పు తీసుకురావడం అనేది ప్రభుత్వ ప్రక్రియల్లో ఎప్పటికీ ముఖ్యమైన అంశంగా ఉంటుందని చెప్పారు. ‘సత్వర వార్తల యుగంలో జీవిస్తున్నాం, ప్రసార మాధ్యమాల్లో వెలువడే అంశాలు, దృశ్యాలు మన ఆలోచనలను నిరంతరాయంగా ప్రభావితం చేస్తున్నాయి, ప్రస్తుతం చోటు చేసుకుంటున్న మార్పులను ఒడిసిపట్టుకోవడం మీడియా రంగంలో ఉన్న వారందరికీ ఒక సవాలుగా మారింది’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
సమాచార సేవ అధికారులకు ఒక సంస్థాగత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి వారి నైపుణ్యాలకు పదును పెట్టేందుకు సమాచార శాఖ నడుంబిగించిందని అన్నారు. కంటెంట్, డిజైన్, సోషల్ మార్కెటింగ్, బ్రాండింగ్, ఇంపాక్ట్ అసెస్‌మెంట్, వీవింగ్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో ప్రభుత్వ లోటుపాట్లను సరిదిద్దడమే ధ్యేయమని పేర్కొన్నారు. అనంతరం వెంకయ్యనాయుడు ఐఎస్‌బి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. నరేంద్రమోదీకి ఒక స్పష్టమైన విజన్ ఉందని, ఆయన భారతదేశాన్ని బలోపేతం చేయదలుచుకున్నారని వెంకయ్య తెలిపారు. విధానపరమైన పక్షవాతంతో ఇంతకాలం దేశం బాధపడిందని, కాని నేడు పరివర్తన వస్తోందని పేర్కొన్నారు. నిరుపేదల అభ్యున్నతికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ వంటి సాంఘిక భద్రతా పథకాలను ఆరంభించామని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొనిపోతూ అభివృద్ధిని సాధించాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని అన్నారు. జన్ ధన్ యోజన, జన సురక్ష యోజన, అటల్ పెన్షన్ యోజన, ముద్ర బ్యాంకు వంటి అనేక ఇతర సాంఘిక భద్రతా పథకాలు అమలుచేస్తున్న విషయాన్ని వెంకయ్య గుర్తుచేశారు.

‘్భరత్ అభివృద్ధి, పురోగతిలో మీడియా పాత్ర ’ అనే అంశంపై శనివారం
ఐఎస్‌బిలో జరిగిన సమావేశానికి హాజరవుతున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు