ఆంధ్రప్రదేశ్‌

పుష్కర ఏర్పాట్లలో రాజీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 13: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎక్కడా రాజీపడకుండా భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించినట్లు రాష్ట్ర హోం మంత్రి, డెప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్, కలెక్టర్ కాంతిలాల్ దండే రూరల్ ఎస్‌పి నారాయణ నాయక్‌తో కలిసి అమరావతిలో జరుగుతున్న పుష్కరస్నానాలు, ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. సౌకర్యాల గురించి భక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌లో డెప్యూటీ సిఎం మీడియాతో మాట్లాడుతూ రోడ్లు, సౌకర్యాలతో పాటు, మంచినీరు, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, ట్రాఫిక్ కూడా బాగా ఉందన్నారు. మొదటి రోజున సిఎం చంద్రబాబు దృష్టికి కొన్ని సమస్యలు వచ్చాయని, వాటినన్నింటినీ తక్షణమే పరిష్కరించినట్లు తెలిపారు. మొదటిరోజున 5 లక్షల మంది పుష్కరస్నానాలు ఆచరించారని, రెండో రోజు రెట్టింపు మంది భక్తులు వచ్చారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకే జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా పుష్కర స్నానాలు ఆచరించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలో 16 కోట్ల రూపాయలతో మహా పుష్కరఘాట్‌ను ఏర్పాటుచేశామని, సిసి కెమేరాలను ఏర్పాటుచేసి క్రౌడ్ మేనేజ్‌మెంట్ కింద అన్ని ఘాట్లలో భక్తులు స్నానాలు చేసేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 31 మంది సిబ్బంది పుష్కర విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. సమస్యలు లేకపోయినా వైఎస్‌ఆర్‌సిపి నాయకులు సమస్యలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. పుష్కరాలకు ఆహ్వానించడానికి వెళితే జగన్మోహనరెడ్డి అందుబాటులో లేరని, భక్తులంతా సంతోషంగా ఉంటే ఏర్పాట్లలో విఫలమైనట్లు ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అన్ని శాఖలను సమన్వయం చేసి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు పుష్కరస్నానాలు చేయలన్న ఉద్దేశంతో నిద్రాహారాలు మాని పని చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష నేత ఫీడ్ బ్యాక్ తీసుకోకుండానే లేనిపోని ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో ఎరువుల బస్తాల తూకాలు తక్కువగా వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, మోసం చేసే కంపెనీలకు సబ్సిడీలు నిలుపుదల చేయిస్తామని స్పష్టంచేశారు. రైతాంగమంతా ఎరువుల కట్టలు కొనేటప్పుడు విధిగా తూకం సరిచూసుకోవాలని సూచించారు. తూకం తగ్గితే నగదు కూడా తక్కువగానే చెల్లించాలన్నారు. రోజురోజుకూ ప్రజల్లో ఉత్సాహం పెరుగుతోందని, మిగిలిన పది రోజుల్లో ఎక్కువ మంది స్నానాలు ఆచరిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ పుష్కరాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే, రూరల్ ఎస్‌పి నారాయణ నాయక్ ప్రతిరోజూ అందుబాటులో ఉండి సౌకర్యాలు మెరుగుపర్చాలని, ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని డెప్యూటీ సిఎం చినరాజప్ప ఆదేశించారు.