రాష్ట్రీయం

అసెంబ్లీలో రోజా రగడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన తర్వాత కూడా అసెంబ్లీలో మంగళవారం ఆమెపై చర్చ జరిగింది.
ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు మంగళవారం చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలేదనే అభియోగంతో వైకాపా బుధవారం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది.
సభా సంప్రదాయాలు పాటించకుండా ఏకపక్షంగా అధికారపక్షం వ్యవహరించిందని వైకాపా ఆరోపిస్తోంది. ఈ విషయమై అవసరమైతే కోర్టుకు వెళ్లే అంశంపై న్యాయ నిపుణులను సంప్రదించింది. మరోవైపు టిడిపి ఎమ్మెల్యే అనిత దళిత వర్గానికి చెందిన తనను వైకాపా ఎమ్మెల్యే రోజా అనరాని మాటలు అన్నారంటూ కంటతడిపెట్టారు. దీంతో రోజా అంశంపైనే శాసనసభ సమావేశాల చివరి రోజూ చర్చ సాగింది. మరోపక్క సభను బహిష్కరించటంతో, సభలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు లేక అసెంబ్లీ బోసిపోయింది. మంత్రి పీతల సుజాత, మహిళా ఎమ్మెల్యేలు యామినీ బాల, అనిత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు రోజా వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు. సభ నుంచి ఆమెను బహిష్కరించాలని కూడా తీర్మానం చేయాలని కోరారు.
వీడియో క్లిప్పింగ్‌లు తదితర ఆధారాలను సేకరిస్తామని, టిడిపి ఎమ్మెల్యే అనిత పట్ల రోజా వ్యవహారశైలి అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.
కాగా లోటస్‌పాండ్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆర్‌కె రోజా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్టీఆర్ భవన్‌లా మారిందని, తనకు దళితులంటే ఎనలేని గౌరవం ఉందని, దళిత మహిళా ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి తనపై లేనిపోని నిందలు మోపారని, చంద్రబాబు అంతుచూస్తానంటూ తీవ్రస్వరంతో మాట్లాడారు.