రాష్ట్రీయం

ఇసుక ధరలకు కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ఇసుక ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, మంత్రివర్గ సమావేశంలో చర్చించి మెరుగైన నూతన ఇసుక విధానాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ఇసుక అక్రమ రవాణాపై మంత్రి పీతల సుజాత ప్రకటన చేశారు. దీనిపై సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ కొంత మంది ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేస్తున్నారని తెలిపారు. దీనిని అరికట్టేందుకు డ్వాక్రా సంఘాలకు అప్పగించి, మహిళలను ప్రోత్సహించామని అన్నారు. వచ్చే ఆదాయంలో డ్వాక్రాలకు 25 శాతం, రైతు సాధికారితకు 25 శాతం అప్పగించి, విధానాన్ని గాడిలో పెట్టామని ఆయన తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎమ్మెల్యేలతో చర్చించామని, ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇప్పుడు ఉన్న ఇసుక విధానాన్ని అవసరమైన మార్పులు-చేర్పులు చేసి వినియోగదారులకు మేలు చేసేలా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చెప్పినట్లుగా ఇసుక నిత్యావసర వస్తువుగా మారిందని అన్నారు. ఇసుక కొరత ఉందని, అయితే రాక్ సాండ్, మెటల్ సాండ్ ఉపయోగించుకోవాల్సి ఉందని అన్నారు. అయితే ప్లాస్టరింగ్ వంటి వాటికి తప్పనిసరాగా ఇసుక అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. మెటల్ సాండ్ కూడా చాలా బాగుందని అన్నారు. వీటి వాడకం పెరిగితే ఇసుక ధరలు అదుపులోకి వస్తాయని అన్నారు. ఇసుక తవ్వకాల వల్ల ఇబ్బందులు రాకుండా వాతావరణ సమతుల్యం పాటించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. చిన్న రిచ్‌లు ఎవరికీ ఇవ్వకుండా స్థానికులకే ఇవ్వాలనుకుంటున్నామని, అవకతవకలు లేకుండా చేస్తామని అన్నారు. ఇసుక ధరల నియంత్రణకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో నూతన ఇసుక విధానంపై చర్చించి మార్పు చేస్తామని అన్నారు. బేషిజాలు ఏమీ లేవని మెరుగైన ఇసుక విధానాన్ని రూపొందించడానికి అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.