రాష్ట్రీయం

బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: బాక్సైట్ నిక్షేపాల వెలికతీతలో వ్యక్తుల ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం ఇచ్చిన జీవో (222)ను రద్దు చేస్తున్నట్టు సిఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలపై మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర మహిళా సాధికారత, శిశు సంక్షేమ, భూగర్భ శాఖ మంత్రి పీతల సుజాత ప్రకటన చేశారు. దీనిపై సభ్యులు మాట్లాడిన అనంతరం చంద్రబాబు స్పందిస్తూ బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలపై చర్చ జరుగుతుంటే, ఎదుర్కొనే ధైర్యం లేక వైఎస్సార్ కాంగ్రెస్ ముందుగానే సభనుంచి వెళ్ళిపోయిందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనులు కొండల్లోనే ఉండాలా? ఆకులు, అలుమలు తింటూ ఉండాలా? నాగరిక సమాజంలోకి రాకూడదా? అని చెప్పారని బాబు గుర్తు చేశారు. మాటలు, సిద్ధాంతాలు బాగున్నాయి కానీ ఆచరణలో చూపించలేదన్నారు. 2009లో అన్‌రాక్ అల్యూమినియం లిమిటెడ్‌తో పెన్నా గ్రూపు రస్-అల్-ఖైమా మధ్య వాటా విధానం 70-30 ఉందని, తర్వాత 2012-13 నాటికి పెన్నా గ్రూపు, రస్-అల్-ఖైమా మధ్య వాటా విధానం 87-13గా మారిందని ఆయన తెలిపారు.
ఎపిఎండిసి-అన్‌రాక్ బాక్సైట్ సరఫరా ఒప్పందం జరిగిందన్నారు. 2007 జూలై 1న జీవోఆర్‌టి 475, 2007 నవంబర్ 6న జీవోఆర్‌టి 735 ద్వారా బాక్సైట్ అమ్మకం ధర నిర్ధారణ, మెస్సర్స్ ఎపిఎండిసికి ఈక్విటీ వాటా నిర్ణయించేందుకు పరిశ్రమలు, ఆర్థిక, సాగునీరు, సిఎడి శాఖల సీనియర్ అధికారులు, గనుల శాఖ ప్రాంతీయ కంట్రోలర్, విసి అండ్ ఎండి, ఎపిఎండిసి, ప్రభుత్వ రంగ సంస్ధల ద్వారా నామినేటెడ్ చేసే ఎక్స్‌పర్ట్ కాస్ట్ అకౌంట్‌తో కూడిన ఆరుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. ఉన్నత స్థాయి కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం 2008 జూలై 13న జీవో 222ను విడుదల చేసి బాక్సైట్ సరఫరా ఒప్పందం చేసుకోవాలని ఎపిఎండిసిని ఆదేశించిందని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను తీసుకునేందుకు గత నెల 24న బాక్సైట్ మైనింగ్ స్థితిపై శే్వతపత్రాన్ని విడుదల చేశామన్నారు. ఎపిఎండిసి గత నెల 27న శే్వతపత్రాన్ని, దాని ఎన్‌క్లోజర్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచిందని వివరించారు. బాక్సైట్ మైనింగ్‌కు సంబంధించి సభ్యుల అభిప్రాయాలు, ప్రజల ఆందోళలనలు పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలు చేపడుతుందని చంద్రబాబు చెప్పారు. గిరిజనుల సంక్షేమం, వారి ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.