రాష్ట్రీయం

పోలీస్ కస్టడీకి హర్షియా, ఫర్హానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఆగస్టు 16: గ్యాంగ్‌స్టర్ నరుూం అనుచరులు ఫర్హానా, హర్షియాలను మరో ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ రాజేంద్రనగర్ 8వ మెట్రోపాలిటన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నార్సింగ్ పోలీసులు ఫర్హానా, హర్షియా నుంచి నరుూంకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టడానికి 12 రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి పిటిషన్‌ను పరిశీలించి ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించారు. నరుూంకు సంబంధించిన ఆస్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్‌ఘడ్, గోవా తదితర రాష్ట్రాలలో భారీ ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం ఉందని, ఫర్హానా, హర్షియా వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించడానికి కస్టడీకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు.

చిత్రం..మంగళవారం రాజేందర్‌నగర్ కోర్టుకు హాజరవుతున్న హర్షియా, ఫర్హానా