రాష్ట్రీయం

తెలంగాణలో పెరగనున్న మెడికల్ సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: మెడిసన్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. తెలంగాణలో మెడికల్ సీట్లు పెరగబోతున్నాయి. తెలంగాణలో మరో మూడు ప్రైవేటు వైద్య కళాశాలల ఏర్పాటుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) అనుమతినిచ్చింది. ఎంసిఐ దేశంలో 26 వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇవ్వగా వాటిలో మూడు తెలంగాణలోనే ఉండటం గొప్ప విషయం. పెరిగిన సీట్లకు ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఎంసెట్-2 లీకేజీతో బాధ పడుతున్న విద్యార్థులకు మెడిసన్ సీట్లు పెరగనుండడం కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. మెదక్ జిల్లా ములగనూరు మండలంలోని ఆర్‌విఎం మెడికల్ కళాశాల, రంగారెడ్డి జిల్లాలోని మహావీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్, పటాన్‌చెరువులోని మహేశ్వరా మెడిక్ సైనె్సస్‌కు కొత్తగా అనుమతులు రాబోతున్నాయి. వీటిలో ఒక్కొక్క దానికి 150 సీట్లు పెరగబోతున్నాయి. దీంతో మొత్తం 450 సీట్లు పెరగనున్నాయి. వీటిలో 50 శాతం కన్వీనర్ కోటా కిందకు వస్తాయి. ఈ కళాశాలలకు సంబంధించిన తనిఖీ సెప్టెంబర్‌లో జరుగుతుంది. ఇలాఉండగా కొత్త సీట్లతో తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో వెయ్యి, ఇఎస్‌ఐలో 60, ప్రైవేటు రంగంలో 2,350 సీట్లకు కౌనె్సలింగ్ జరగనున్నది. వీటి కౌనె్సలింగ్ ఎంసెట్-3, నీట్-2 ఆధారంగా నిర్వహిస్తారు.