రాష్ట్రీయం

12,179 పోస్టుల భర్తీకి ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఉన్నాయని, కాని వివిధ శాఖల నుంచి వివరాలు అందాల్సి ఉందని ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభకు తెలిపారు. ప్రస్తుతానికి విద్య, పోలీసు తదితర శాఖల్లో 12,179 ఖాళీ పోస్టుల నియామకానికి అనుమతి ఇచ్చామన్నారు. ఏపిపిఎస్‌సి, డిఎస్‌సి ద్వారా నేరు నియామకం కోసం మరి కొన్ని ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 63 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచే విషయమై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ చేసేంత వరకు తాత్కాలిక చర్యగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించనున్నట్లు చెప్పారు.
అనంతపురంలో ప్రస్తుతం ఉన్న పోలీసు శిక్షణా కళాశాలని ఏపి పోలీసు అకాడమిగా స్ధాయిని పెంచేందుకు ప్రభుత్వం వద్ద పరిశీలనలో ప్రతిపాదన ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప శాసనసభకు తెలిపారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శిక్షణా సంస్ధలో అన్ని వౌలిక సదుపాయాలు కల్పించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారన్నారు.
పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు
రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, దేవాలయ పర్యాటక రంగం అభివృద్ధికి ఒక సీనియర్ దేవాదాయ శాఖాధికారి ద్వారా అధ్యయనం చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో చేపడుతామన్నారు. రాయలసీమలో పర్యాటక రంగం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశామన్నారు. కర్నూలు జిల్లాలో బెలూం గుహలకు నిధులు కేటాయించామన్నారు.

ఎఇఇ ఉద్యోగాలకు
30న ఇంటర్వ్యూలు

హైదరాబాద్, డిసెంబర్ 22: నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (మెకానికల్) పోస్టుల నియామకానికి ఈ నెల 30వ తేదీన ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. నోటిఫికేషన్ 12/2015 ద్వారా లిఖిత పరీక్షలో ఎంపికైన అభ్యర్ధులకు మాత్రమే వౌఖిక పరీక్ష ఉంటుందని, 30వ తేదీన ఉదయం 9 గంటలకే అన్ని ఒరిజనల్ సర్ట్ఫికేట్లతో అభ్యర్ధులు హాజరుకావాలని సూచించారు.
రాజధానిలో థింక్‌సెల్ సెంటర్
థింక్‌సెల్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించినట్టు సంస్థ డైరెక్టర్ ఆదిత్యరెడ్డి తెలిపారు. జిఆర్‌ఇ, జిమ్యాట్, శాట్, ఎల్ శ్యాట్, ఎసిటి, యుఎస్‌ంఎల్‌ఇ, ఎన్‌బిడిఇ, ఎన్‌సిఎల్‌ఇఎక్స్, టోఫెల్, ఐఇఎల్‌టిఎస్ తదితర అంతర్జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష, అర్హత పరీక్షలకు ప్రపంచస్థాయి శిక్షణ అందిస్తామని అన్నారు. హైస్కోర్ గ్యారంటీ స్కీమ్‌ను తాము అమలుచేస్తున్నామని, లేకుంటే వారు కట్టిన ఫీజును వెనక్కు ఇవ్వడం జరుగుతుందని ఆమె చెప్పారు.