రాష్ట్రీయం

ఇళ్లకు గ్లోబల్ టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: రాజధానిలో స్తబ్దుగా సాగుతున్న డబుల్ బెడ్‌రూం పథకానికి మళ్లీ చురుకొచ్చినట్టు కనిపిస్తోంది. ఏడాదిలోగా హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల నిర్మాణాల కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని సర్కారు నిర్ణయించింది. ఈ ఏడాది ఫస్ట్ ఫేజ్‌లో 78 కాలనీల్లో 25 వేల డబుల్ బెడ్‌రూమ్‌లు నిర్మించాలని నిర్ణయించినట్టు మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని సాధారణ ఎన్నికలకు ముందునుంచీ తెరాస ప్రత్యేకంగా చెబుతూ వస్తోంది. ఎన్నికల ప్రణాళికలో సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం ఎన్నికల్లో తెరాసకు బాగా కలిసొచ్చే ఆయుధమే అయ్యింది. కెసిఆర్ ఐడిహెచ్ కాలనీలో పర్యటించి శిథిలావస్థకు చేరిన ఇళ్లను తొలగించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ఐడిహెచ్ కాలనీలో ఏడాదిలోపే ఇళ్లను పూర్తి చేశారు. ఢిల్లీలో ఐఏఎస్‌లకు కేటాయించే క్వార్టర్లకన్నా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు బాగున్నాయని గవర్నర్ సైతం ప్రశంసించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల హామీ బాగా పనిచేసింది. ఊహించని విధంగా తెరాసకు 99 డివిజన్లలో విజయాన్ని కట్టబెట్టింది. డబుల్ బెడ్‌రూం ఇళ్లపై నమ్మకంతోనే ప్రజలు విజయం అందించారని ఆనందంగా ప్రకటించిన కెసిఆర్, అప్పటికప్పుడు లక్ష ఇళ్ల మంజూరీని ప్రకటించారు కూడా. అయితే తరువాత ఈ పథకం ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రభ్వుం నిర్ణయించిన ధరకు కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష ఇళ్లతోపాటు రాష్ట్రంలోని మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో లక్ష ఇళ్లను మంజూరు చేశారు. హైదరాబాద్‌లో సత్వరం ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితి మెరుగు పర్చడంపై దృష్టి సారించారు. వైట్ ట్యాప్ రోడ్లను నిర్మించనున్నట్టు చెప్పారు. ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. జిహెచ్‌ఎంసి పరిధిలో మొత్తం 14 వందల మురికివాడలున్నాయి. వాటిలో కనీస సౌకర్యాలు మెరుగు పరచాలని నిర్ణయించారు.