రాష్ట్రీయం

వచ్చే మార్చి నాటికి పులిచింతల పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: వచ్చే ఏడాది మార్చి నాటికి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన బదులిస్తూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనా ప్రకారం రూ.1818.17 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇంతవరకు 97 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటి సదుపాయం కలుగుతుందన్నారు. వరద నీటిని పరిరక్షించుకోవడం ద్వారా నీరు- చెట్టు కార్యక్రమాన్ని అమలు చేసిన కారణంగా రాష్ట్రంలో భూగర్భ జల మట్టాలు 2.14 మీటర్లకు పెరిగినట్లు చెప్పారు. కోస్తా ఆంధ్రలో 0.06 మీటర్లు, రాయలసీమలో 6.83 మీటర్లు కలిపి మొత్తం పైన 2.14 మీటర్ల భూగర్భ జల మట్టాలు పెరుగుదల నమోదైందన్నారు.
రాజధాని శంకుస్ధాపన ఖర్చు
ఆంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు పది కోట్ల రూపాయలు ఖర్చు అయిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శాసనసభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన బదులిస్తూ వేదిక వద్ద ఏర్పాట్ల కోసం గుంటూరు జిల్లా కలెక్టర్ ఏడుకోట్ల రూపాయలను ఖర్చుచేశారన్నారు.ప్రోటోకాల్, వసతి, వాహనాలు మొదలైన వాటి కోసం కృష్ణా జిల్లా కలెక్టర్ రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేశారన్నారు. భాష, సాంస్కృతిక శాఖ విజ్ఞాపనపై ఆహారం, పారితోషికం లాంటి వాటి కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రూ.39.32 లక్షలను ఖర్చు చేసిందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన రాష్ట్రప్రభుత్వం జీవోను విడుదల చేసిందని, దీని ప్రకారం అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్టవ్రేడుకగా ప్రకటించిందన్నారు.