రాష్ట్రీయం

మెడ్‌టెక్ పార్కుద్వారా 25వేల ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగష్టు 17: విశాఖపట్నంలో మెడ్ టెక్ పార్కు ఏర్పాటు ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 19 నాడు పార్కు ప్రారంభోత్సవానికి రావాలని పలువురి కేంద్రమంత్రులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆహ్యానించారు. ఢిల్లీలో బుధవారం నాడు కామినేని శ్రీనివాస్ విలేఖరులతో మాట్లాడుతూ మెడ్‌టెక్ పార్కు ఏర్పాటుకు కేంద్రం రూ.175 కోట్లు నిధులు విడుదల చేసిందని,రాష్ట్ర ప్రభుత్వం 270 ఎకరాల భూమి కేటాయించిందని చెప్పారు. ఈ పార్కులో 200లో సంస్థలు యూనిట్‌లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ ఏడాదిలోపు మెడ్‌టెక్ పార్కు నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా వెద్యవిద్య సీట్లపై స్పందిస్తూ పారదర్శకంగానే సీట్లను భర్తీ చేస్తామని పెర్కొన్నారు. వైద్య కాళశాలలో మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లుగా బదలాయించేందుకు వీలులేదన్నారు. ఈ వ్యవహారంపై ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.