రాష్ట్రీయం

సహకరించిన వారి జాబితా రెడీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఆగస్టు 17: నరుూంకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాలను నరుూం భార్య హసినా, అక్క సలీమా, వాచ్‌మెన్ అబ్దుల్ మతిన్, అతని భార్య ఖలీమాలను పోలీసులు రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణం మిలీనియం టౌన్‌షిప్‌లోని గ్యాంగ్‌స్టర్ నరుూం ఇంట్లో ఉన్న భార్య, సోదరి, వాచ్‌మెన్, అతని భార్య నలుగురిని పోలీసులు అరెస్టు చేసి ఇంట్లో ఉన్న ఆయుధాలను, ఇతర రికార్డులను స్వాధీనపర్చుకుని షాద్‌నగర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. దీంతో కోర్టు ఆదేశంతో ఈ నలుగురిని 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అయతే, వీరి నుండి సమాచారాన్ని సేకరించేందుకు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. అందుకు కోర్టు అనుమతి తీసుకున్న తరువాత బుధవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుండి వీరిని పోలీసులు షాద్‌నగర్‌కు తీసుకువచ్చి రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా ఈ ప్రాంతంలో నరుూం గ్యాంగ్‌కు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి..రియల్ ఎస్టేట్ దందా, సెటిల్‌మెంట్లు తదితర వివరాలను వీరి నుండి రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నయాం ఇంట్లో దొరికిన మారణాయుధాలను ఎవరు సప్లై చేశారు..ఎక్కడి నుంచి వచ్చాయి..దీంతోపాటు షాద్‌నగర్ పట్టణంలోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఇల్లు ఖరీదు చేసే సమయంలో రిజిస్ట్రారు, దస్తావేజులను పరిశీలించి వివరాలు సేకరించారు. మిలీనియం టౌన్‌షిప్‌లో నయాం ఇల్లు ఖరీదు చేసే సమయంలో సహకరించిన వారి జాబితా వివరాలు కూడా సేకరించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇంతేకాకుండా ఈ ప్రాంతంలో విలువ గల భూముల నుండి డీలింగ్ కోసం కొంతమంది నందిగామ, కొత్తూరు, చేగూరు, షాద్‌నగర్ ప్రాంతాలలో భూముల సెటిల్‌మెంట్ కోసం బేరసారాలు సాగించిన వారి వివరాలు సైతం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో కూడా నరుూం ముఠాకు రాజకీయ నాయకులు, పోలీసులు సహకరించారా..లేదా అనే వివరాలను కూడా అదుపులోకి తీసుకున్న వారి నుండి సేకరిస్తున్నారు.