రాష్ట్రీయం

భగ్గుమన్న సచివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌వద్ద పర్సనల్ సెక్రటరీ (పిఎస్) గా పనిచేస్తున్న ఎం పద్మావతిని బుధవారం అర్థంతరంగా బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పద్మావతి ఏడాది కాలంగా నవీన్ మిట్టల్ వద్ద పనిచేస్తున్నారు. కమలనాథన్ కమిటీ పరిశీలన తర్వాత పద్మావతిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. సచివాలయంలోని ఆర్థిక శాఖ సిబ్బందిని పద్మావతి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ రెండు రోజుల నుండి తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ సచివాలయం డి-బ్లాకు నాలుగో అంతస్తులోని నవీన్ మిట్టల్ ఛాంబర్ ఎదుట ఉద్యోగులు మంగళవారం ఆందోళన చేశారు. పద్మావతిని ప్రస్తుతం ఉన్న పోస్టు నుండి తప్పించాలని, ఎపికి ఆమెను పంపించివేయాలని డిమాండ్ చేశారు. అన్ని కోణాల్లో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మిట్టల్‌తోపాటు అదే శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉద్యోగులకు హామీ ఇచ్చారు. బుధవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, మళ్లీ నవీన్ మిట్టల్ ఛాంబర్ ముందు తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నవీన్ మిట్టల్ నేమ్‌ప్లేట్‌ను ధ్వంసం చేశారు. ఈ సమయంలో సి-బ్లాకులోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వద్ద సమావేశంలో ఉన్న నవీన్ మిట్టల్ హుటాహుటిన తన ఛాంబర్‌కు వచ్చారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులతో మరోదఫా చర్చలు జరిపారు. చర్చల అనంతరం పద్మావతిని బదిలీ చేస్తూ, జిఆర్ రెడ్డి వద్ద పిఎస్‌గా నియమించారు.
నేను వేధించలేదు: పద్మావతి
తాను సిబ్బందిని వేధించానన్న ఆరోపణల్లో వాస్తవం లేదని పద్మావతి చెప్పారు. ఒకవైపు ఆందోళన జరుగుతుండగా, మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ, తాను ఎవరినైనా వేధించినట్టు నిరూపిస్తే, ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు.

చిత్రం.. పద్మావతి