రాష్ట్రీయం

తూర్పు వైపూ చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 17: తూర్పు తీరంలో ఎగుమతులు, దిగుమతులను నిర్వహించేందుకు ఐరోపా దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఐరోపా దేశాల్లో రెండో అతిపెద్ద పోర్టుగా పేరుగాంచిన బెల్జియంకు చెందిన ఎంట్వెర్ప్ ఇంటర్నేషనల్ పోర్టు ప్రతినిధులు బుధవారం విశాఖ పోర్టును సందర్శించారు. భారత్‌లో బెల్జియం రాయబారి జాన్ ల్యూక్స్, చెన్నైలోని బెల్జియం కాన్సులేట్ జనరల్ బర్ట్ డీ గ్రూఫ్ సహా ఎంట్వెర్ప్ ఇంటర్నేషనల్ పోర్టు అథారిటీ కమ్మర్షియల్ మేనేజర్ ల్యూక్ ఆర్నాట్స్, పోర్టు ప్రాజెక్ట్సు డైరెక్టర్ మార్క్ పాలిక్ తదితరులు విలేఖరులతో ఇష్ఠాగోష్టిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకూ పశ్చిమ తీరంలోనే జరిగిన తమ వ్యాపార కార్యకలాపాలను ఇక మీదట తూర్పుతీరంలో కూడా కొనసాగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించినట్టు తెలిపారు. ఐరోపా పోర్టుల నుంచి భారత్‌లోని విశాఖ పోర్టుకు నేరుగా కంటైనర్ కార్గో లైన్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకూ పశ్చిమ తీరంలోని సంప్రదాయ పోర్టులతోనే వ్యాపార కార్యకలాపాలు సాగించిన తమ పోర్టులు తాజాగా తూర్పు తీరంలోని మేజర్ పోర్టులతో ఎగుమతి, దిగుమతులను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా తూర్పుతీరంలోని విశాఖ పోర్టు ద్వారా కంటైనర్ కార్గోను అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలపై దృష్టి పెట్టామన్నారు. వ్యాపారానికి అనువైన వాతావరణం ఇక్కడ ఎక్కువగా ఉందన్నారు. ఇక్కడ నుంచి వినిమయ ఉత్పత్తులు, ఆరోగ్య సంబంధ ఉత్పత్తులు, తాజా ఉత్పత్తుల ఎగుమతులకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. యాంట్‌వెర్ప్ పోర్టు ఇప్పటికే జెఎన్‌పిటి, ఎస్సార్ షిప్పింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుందని, రాబోయే రెండేళ్లలో ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని ప్రతినిధులు వెల్లడించారు. అలాగే బెల్జియం నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, దీనిలో ఆంధ్రప్రదేశ్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న భారత్‌లో బెల్జియం దౌత్యవేత్త జాన్ ల్యూక్స్. చిత్రంలో ఎంట్వెర్ప్ ప్రతినిధులు