రాష్ట్రీయం

కోటి ఎకరాలు.. కాకి లెక్కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, అందులో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా తాను సిద్ధమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఐదు నెలల క్రితం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నీటి పారుదల ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సభ నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారంటూ, అందుకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ రోజు సభకు గైర్హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజెంటేషన్‌కు దీటుగా తామూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటూ ఇంతకాలం చెబుతూ వచ్చిన ఆ పార్టీ నాయకులు ఎట్టకేలకు బుధవారాన్ని ముహూర్తంగా నిర్ణయించారు. రావి నారాయణ రెడ్డి మెమోరియల్ హాలులో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎఐసిసి నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్, ఎఐసిసి కార్యదర్శి ఆర్‌సి కుంతియా, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తొలుత టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పలు ప్రాజెక్టులను ఆయన ప్రస్తావిస్తూ ప్రాజెక్టుల రీడిజైన్, అవినీతిపై తాము పోరాటం చేస్తామని చెప్పారు. వ్యాప్కోస్ సంస్థపై కేసు వేయాలని ఆలోచిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో అన్నీ అబద్ధాలే చెప్పారన్నారు. ధవళేశ్వరానికి నీరు ఇచ్చేందుకే కాంగ్రెస్ తమ్మిడిహట్టిని అడ్డుకుంటున్నదని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నారు. సముద్రంలో నీరు వృథాగా పోకుండానే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు చేపడుతున్నామని చెబుతూనే ఎన్ని చేసినా వెయ్యి టిఎంసిల నీరు వృధాగా బంగాళా ఖాతంలో కలుస్తుందని కెసిఆర్ తన వ్యాఖ్యలను తానే ఖండించుకున్నారని ఎద్దేవా చేశారు. రీడిజైన్ కంటే ముందుగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
23న నిరసన
ముఖ్యమంత్రి కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈనెల 23న మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకోనున్నందున, దీనిని నిరసిస్తూ రాష్టవ్య్రాప్తంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలుపుతారని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయాన్ని 83 వేల కోట్ల రూపాయలకు పెంచారని ఆయన చెప్పారు. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని, తాగు నీరు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సిడబ్ల్యుసి అనుమతుల కోసం ఢిల్లీ తీసుకెళ్ళాలని, ఎవరి కాళ్ళు పట్టుకోవాలన్నా పట్టుకుంటామని అన్నారు.
నిజాల నిగ్గు తేల్చేందుకే!
టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నీ అబద్ధాలే చెప్పారని, నీటి నిజాలు నిగ్గు తేల్చేందుకే తాము వాస్తవ జల దృశ్యం చేపట్టామని అన్నారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని, తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టు ఆయకట్టు కాకుండా కోటి ఎకరాల ఆయకట్టు ఎక్కడ ఉన్నదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో మొత్తం ఉన్న భూమి 2కోట్ల 83 లక్షల ఎకరాలు కాగా అందులో కోటి 11 లక్షల ఎకరాల భూమి మాత్రమే సాగుకు ఉపయోగంగా ఉందని అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జలయజ్ఞం కింద 51.47 లక్షల ఎకరాలకు నీరు అందించిందని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే నాటికే తెలంగాణలో భారీ, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల కింద 4.38 లక్షల ఆయకట్టు సాగులోకి వచ్చిందని అన్నారు. అలాగే చిన్న నీటి పారుదల, చెరువులు, ఇతరత్రా మరో 13 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రావడంతో మొత్తం 17 లక్షల 38 వేల ఎకరాలు సాగులోకి వచ్చిందని చెప్పారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే 29 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన తెలిపారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 90 నుంచి 99 శాతం వరకు పూర్తయిన ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తాము చేపట్టిన ప్రాజెక్టులకు ఇంకా అవసరమైన 8 వేల 970 కోట్ల రూపాయలు విడుదల చేసి వాటిని పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణహితను మార్చి తెలంగాణ ప్రాణం తీశారని ఆయన విమర్శించారు. కృష్ణా నదిలో నికర జలాలేవీ అని ఆయన ప్రశ్నించారు. డిండి ప్రాజెక్టును గందరగోళం చేశారని ఆయన విమర్శించారు. అడ్డగోలు దోపిడీకే గ్రీన్ ఛానల్ అని దాసోజు విమర్శించారు. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించి, ప్రజెంటేషన్ ఇస్తామని దాసోజు శ్రవణ తెలిపారు.

చిత్రాలు.. నీటి పారుదల ప్రాజెక్టులపై టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌. హాజరైన కాంగ్రెస్ నేతలు కుంతియా, దిగ్విజయ్ సింగ్, భట్టి విక్రమాక్ర, మల్లు రవి తదితరులు