రాష్ట్రీయం

ఐఎఎస్ x ఐపిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపిఎస్ అధికారి సివి ఆనంద్‌ను నియమించడం వివాదాస్పదంగా మారింది. ఈ నియామకం ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల మధ్య చిచ్చు పెడుతోంది. తమను నియమించాల్సిన పోస్టుల్లో ఐపిఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వడం ఏమిటనీ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంపై కినుక వహించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇకముందు ఇలాంటి నియామకాలు జరుగకుండా బ్రేక్ వేయాలని ఐఏఎస్ అధికారులు భావిస్తున్నారు. తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అపాయింట్‌మెంట్ ఇప్పించాల్సిందిగా ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకరిని మరో ఐఏఎస్ అధికారి ఆశ్రయించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ముఖ్యమంత్రి కెసిఆర్ బిజీగా ఉండటంతో ఒకటి రెండు రోజుల్లో అపాయింట్‌మెంట్ తీసుకోనున్నట్టు సదరు అధికారి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఐఏఎస్‌లకు ఇవ్వాల్సిన పోస్టుల్లో గతంలో ఒకరు ఇద్దరిని నియమించిన సందర్భాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టులు కావని అధికారవర్గాల సమాచారం. అయితే పౌర సరఫరాల కమిషనర్ వంటి కీలకమైన పోస్టులో ఐపిఎస్ అధికారి ఆనంద్‌ను నియమించడం ఏమిటని ఐఏఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా ఐపిఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కొనసాగుతున్నారు. అలాగే రవాణా శాఖ కమిషనర్‌గా కూడా ఐపిఎస్ అధికారి ఒకరిని నియమించడానికి రంగం సిద్ధమైందని ఈ వర్గాల సమాచారం. ఇలాగే పోతే మున్ముందు మరిన్ని పోస్టులలో ఐపిఎస్ అధికారుల ఆధిపత్యం పెరిగిపోతుందని ఐఏఎస్‌లు వాపోతున్నారు. తమ అసంతృప్తిని వారు మొదట రెవిన్యూ మంత్రి వద్ద వ్యక్తం చేయగా, ఆయన నిస్సహాయత వ్యక్తం చేసినట్టు తెలిసింది.