రాష్ట్రీయం

స్పోర్ట్స్‌కోటాపై అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: క్రీడల్లో ప్రతిభ చూపని వారు కూడా క్రీడల కోటా కింద ఎంబిబిఎస్ కోర్సుల్లో సీటు పొందేందుకు ప్రయత్నం చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని వల్ల క్రీడారంగం, వైద్య రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని హైకోర్టు పేర్కొంది. కొన్ని క్రీడలను గుర్తిస్తూ ఏపి ప్రభుత్వం 2014 అక్టోబర్ 10వ తేదీన జీవో జారీ చేసింది. ఈ జీవోలోని క్రీడలను ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఈ ఏడాది ఎంసెట్‌కు హాజరైన పి తరుణ అనే విద్యార్థిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. పవర్ లిఫ్టింగ్, నెట్‌బాల్, త్రోబాల్, బాక్సింగ్ తదితర క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి గుర్తింపు ఉంటుందని ఏపి ప్రభుత్వం జీవోలో పేర్కొందని ఆమె కోర్టుకు తెలిపారు. కాగా ఈ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. బిసి, ఎస్సీ, ఎస్టీ కోటాకే రాజ్యాంగ పరమైన రక్షణ ఉంటుందని, ఎన్‌సిసి, క్రీడల కోటాకు ఎటువంటి రాజ్యాంగ పరమైన గ్యారంటీ ఉండదని హైకోర్టు పేర్కొంది. నిజంగా క్రీడలంటే ఆసక్తి, ప్రతిభ ఉన్న వారు మెడికల్ కోర్సులో చేరితే వారికి క్రీడలంటే ఆసక్తి పోతుందని హైకోర్టు పేర్కొంది. ఈ తరహా కోటాల పట్ల సమీక్షించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. జీవితంలో గొప్ప ప్రొఫెషనల్స్‌గా లేదా క్రీడాకారులుగా రాణించేందుకు ఈ కోటాలు ఉపయోగపడవని హైకోర్టు పేర్కొంది. 2015లో కూడా జీవో 14ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైతే కోర్టు డిస్మిస్ చేసిందని హైకోర్టు పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం నెట్‌బాల్, ఇతర క్రీడలను కోటా పరిధిలో చేర్చే విషయమై కమిటీని నియమించిందని, అందుకే జీవో 14ను జారీచేశారని కోర్టు పేర్కొంది. గత ప్రభుత్వం క్రీడల కోటా కింద సీటు పొందేందుకు 28 క్రీడలను గుర్తించింది. కాగా ఈ కోటా పరిధిని విస్తృతం చేస్తూ 55 క్రీడలకు పెంచారు. దీనివల్ల కోర్టులో లిటిగేషన్లు పెరుగుతున్నాయి. స్పోర్ట్స్ కోటా కింద ఎన్ని క్రీడలను గుర్తించారో వివరాలు తెలియచేయాలని హైకోర్టు ఆదేశించింది.