రాష్ట్రీయం

నరుూం డంపులకోసం గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: గ్యాంగ్‌స్టర్ నరుూం రహస్య డంప్‌లపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నరుూం ఆస్తుల లెక్కలు పోలీసులకు అంతుపట్టడం లేదు. ఎక్కడ ఎన్ని ఆస్తులున్నాయో అధికారులు సైతం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటి వరకు సిట్ గుర్తించిన ఆస్తులే దిమ్మతిరిగిపోయేలా ఉంటే.. తాజాగా గురువారం పుప్పాలగూడలో మరో ఇంటిని సిట్ అధికారులు కనుగొన్నారు. ఫర్హానా పేరుతో రిజిస్టర్ అయి ఉన్న ఇల్లు భారీ విలువగలదే. నరుూం అనుచరులను విచారిస్తున్న సిట్ అధికారులు గురువారం మిర్యాలగూడకు చెందిన ఫయాజ్ అనే మరో నరుూం అనుచరుడిని శంషాబాద్‌లో అరెస్టు చేశారు. అతని నుంచి ఒక తపంచా, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు స్వాధీన పరచుకున్న భూములు, ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లను సిట్ అధికారులు రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలిస్తున్నారు. కాగా నరుూం వద్ద భారీ మొత్తంలో కాకుండా రూ. 2.14 కోట్ల నగదు, 2.14 కేజీల బంగారం మాత్రమే లభ్యం కావడంతో నరుూం డంప్‌లలో దాచిపెట్టి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నరుూం మాజీ మావోయిస్టు కాబట్టి మావోయిస్టులు డంప్ ఏర్పాటు చేసుకునే మాదిరిగానే నరుూం కూడా పెద్ద మొత్తంలో డబ్బు, బంగారాన్ని డంపుల్లో దాచిపెట్టుకోవచ్చని, ఆ దిశగా సిట్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. నలుగురు నరుూం అనుచరులను సిట్ విచారిస్తోంది. గ్యాంగ్‌స్టర్ నరుూం అనుచరులైన ఫరుూం, షాహిన్, ఫర్హానా, అఫ్షాలను పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం విదితమే. బుధవారం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు గురువారం నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. ఈ విచారణలో సిట్ అధికారులతోపాటు నల్గొండ జిల్లా పోలీసులతోపాటు క్లూస్ టీం సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇదిలావుండగా జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మరో ఇద్దరు నరుూం అనుచరులు శ్రీ్ధర్‌గౌడ్, బలరాంలను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. తెలంగాణలోనే వేల కోట్ల ఆస్తులుంటే నరుూం దందా సాగిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, చత్తీస్‌గఢ్, ఒడిశాలలో ఎన్ని ఆస్తులుంటాయన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు సైబరాబాద్ వెస్ట్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించిన నరుూం వంట మనిషి ఫర్హానా, అతని డ్రైవర్ భార్య అఫ్షాలు ఐదు రాష్ట్రాల్లో నరుూంకు ఆస్తులున్నట్టు సిట్ విచారణలో చెప్పినట్టు తెలిసింది. ఈ ఆస్తులను గుర్తించేందుకు వీరిని ఐదు రాష్ట్రాలకు తీసుకెళ్తున్నట్టు సిట్ అధికారి ఒకరు తెలిపారు. నరుూం భార్య హసీనా బేగం, అక్క సలీమా బేగం, షాద్‌నగర్ ఇంటి వాచ్‌మన్ మతీన్, అతని భార్య ఖలీమాలను పోలీసులు వారం రోజుల కస్డడీతో విచారిస్తున్నారు. పది మందిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు తెలంగాణతోపాటు మొత్తం ఐదు రాష్ట్రాల్లో నరుూంకు బినామీ పేర్లతో ఆస్తులున్నట్టు భావిస్తున్నారు.
బ్యాంకులకు సిట్ నోటీసులు
సిట్ అధికారులు నరుూం ఇంట్లో దొరికిన దాదాపు 250 పాస్‌బుక్‌లకు సంబంధించి ఆయా బ్యాంకులకు సిట్ నోటీసులు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సిట్ ఆ నోటీసులో పేర్కొంది. మరో వైపు నరుూం సోదరుడు ఫరుూం, అతని భార్య షాహిన్‌తోపాటు నరుూం అనుచరులు ఫర్హానా, అఫ్షాలను అధికారులు విచారిస్తున్నారు.