రాష్ట్రీయం

బెజవాడగా పేరు మార్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మార్చి ఆంధ్రుల అభినందనలు అందుకున్న చంద్రబాబు, విజయవాడ పేరు కూడా మార్చాల్సిన అవసరం ఉందని బెంగళూరు విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు తంగిరాల వెంకట సుబ్బారావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడ అనే దుష్ట సమాసాన్ని బెజవాడ అనే అచ్చమైన తెలుగుపేరుగా మార్చాలని సూచించారు. ఆదికవి నన్నయ్య కన్నా ముందున్న శాసనాల్లోనూ బెజవాడ అనే పేరు ఉందని గుర్తు చేశారు. క్రీ.శ.10వ శతాబ్దం నాటి ‘యుద్ధమల్లుని బెజవాడ శాసనం’ దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. 6,7 శతాబ్దాల నాటి శాసనాల్లో కూడా ‘బెజయిత్త భటరళదత్త’ అని ఉందని వివరించారు. యుద్ధమల్లుని శాసనంలో ‘కందుకూరే బెజవాడ గావించెమెచ్చి’ అని ఉందన్నారు. బెజవాడ అనేపేరు ఏదో ఇంగ్లీషువాడు పెట్టిన పేరుగా భావించి, కవిపండితులను సంప్రదించకుండా ఆనాటి తొలి శాసనసభ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు ఈ పేరును విజయవాడగా చేసి ఆంధ్రులకు బలవంతంగా అంటగట్టారని వ్యాఖ్యానించారు. ‘విజయ’ సంస్కృతపదం. ‘వాడ’ తెలుగుపదం. రెండూ కలిపితే దుష్టసమాసం అవుతుందని విశే్లషించారు. బెజవాడ అన్నదే అచ్చమైన తెలుగుపదమని, దీనిని సంస్కృతంలోకి మారిస్తే ‘విజయవాటిక’ అవుతుందే తప్ప విజయవాడ కాదని స్పష్టం చేశారు. అందువల్ల విజయవాడను బెజవాడ లేదా విజయవాటికగా మార్చాలని సూచించారు.