రాష్ట్రీయం

రేణిగుంటలో కాలిపోయన బాండ్లు, పత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, డిసెంబర్ 22: కాల్‌మనీ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం గట్టిచర్యలు చేపట్టడంతో చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో స్థానిక రాజరాజేశ్వరి కాలనీ సమీపంలో కల్వర్టు కింద గుట్టలకొద్దీ మార్టుగేజు, ఖాళీ చెక్కులు, దస్తావేజులు, 100 రూపాయల ఖాళీ బాండ్లు దగ్ధం చేసిన సంఘటన మంగళవారం ఉదయం రేణిగుంటలో చోటుచేసుకుంది. కాల్‌మనీపై గట్టిచర్యలు తీసుకుంటామని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో రెండురోజుల క్రితం రేణిగుంట తహశీల్దార్ కార్యాలయంలో కాల్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సెంటర్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. వచ్చిన ఫిర్యాదులను ఒక్కొక్కటి విచారిస్తుండగా తాజాగా మంగళవారం ఉదయం కల్వర్టు వద్ద గుట్టలు గుట్టలుగా ఖాళీ బాండు పేపర్లను, చెక్కులను దగ్ధం చేయడం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న తహశీల్దార్ ఘటనా స్థలానికి వెళ్లి సగం కాలిపోయిన 100 రూపాయల ఖాళీ స్టాంప్ ప్యాడ్‌లు, రిజిస్టర్ డాక్యుమెంట్లు, అన్ రిజిస్టర్ డాక్యుమెంట్లు, తుడా అప్రూల్ లేఔట్ ఒరిజినల్ ప్లానింగ్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరుపతి తహశీల్దార్‌కు పంపించి విచారణ చేపట్టి చర్యలు చేపడతామన్నారు.

అగ్రి గోల్డ్‌పై సమగ్ర నివేదిక
సిఐడిని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, డిసెంబర్ 22: అగ్రి గోల్డ్ కేసులో ఇంతవరకు జరిగిన దర్యాప్తు వివరాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు మంగళవారం ఆంధ్రా సిఐడి శాఖను ఆదేశించింది. తెంలగాణ అగ్రి గోల్డ్ కస్టమర్స్ ఏజెంట్ల సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ కేసులో సిఐడి దర్యాప్తు తీరును కోర్టు విచారించింది. హైకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ తరఫున న్యాయవాది రవి ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఒకటి రెండు రోజుల్లో కమిటీ సమావేశమై గుర్తించిన ఆస్తులను ఇ- ఆక్షన్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలిపారు.