రాష్ట్రీయం

దేశంలో మొదటిసారిగా ‘మూక్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: ప్రపంచవ్యాప్తంగా విద్యారంగ విస్తరణలో అమలుచేస్తున్న ‘మూక్స్’( మాసివ్ ఆన్‌లైన్ ఓపెన్ కోర్సు)ను సార్వత్రిక విద్యా విధానం ద్వారా తొలిసారిగా భారత్‌లో నిర్వహించేందుకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని ఐఐటిలు, ఐఐఎంలు మూక్స్ నిర్వహిస్తున్నా, పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు అంబేద్కర్ వర్శిటీ సిద్ధమవుతోంది. అయితే ఇందుకు జాతీయ అపెక్స్ సంస్థలు యుజిసి, ఎంహెచ్‌ఆర్‌డి అనుమతి రావల్సి ఉందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె సీతారామారావు పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ విద్యాత్మకంగా వర్శిటీ స్వరూపాన్ని మార్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వర్శిటీలో పెనుమార్పులకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
వచ్చే ఏడాది నుండి సిబిసిఎస్ విధానాన్ని డిగ్రీ స్థాయిలో ప్రవేశపెడతామని, యూనివర్శిటీకి అకడమిక్ క్యాలండర్ రూపొందిస్తామని అన్నారు. తెలంగాణ వైతాళికులను గుర్తించి వారి పేరిట వ్యవస్థాపకదినోత్సవాలను నిర్వహిస్తామని వెల్లడించారు. గ్రామాల్లో డిగ్రీ పూర్తి చేయకుండా మిగిలిపోయిన విద్యార్ధులను గుర్తించి వారికి గడువు ఇచ్చి ప్రత్యేక డ్రైవ్ కింద వారు గ్రాడ్యూయేట్లు అయ్యేలా చర్యలు చేపట్టామని అన్నారు. రాను రాను ఉపాధికి వీలు కల్పించే వృతివిద్యాకోర్సులపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. ఇందుకోసం మండల స్థాయిలో రిసోర్స్ సెంటర్లు పెడతామని పేర్కొన్నారు. పిహెచ్‌డి, ఎంఫిల్ అడ్మిషన్లను సైతం క్రమబద్ధీకరిస్తామని, ఇందుకోసం యుజిసి, ఎంహెచ్‌ఆర్‌డితో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రమాణాలను పాటించడంలో వెనక్కు తగ్గేది లేదని, అయితే రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు మరింత చేరువ అయ్యేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు.
వర్శిటీ పరిధిలో ఐదు ఫ్యాకల్టీలు, 23 శాఖలు, 219 స్టడీ కేంద్రాలున్నాయని, 23 రీజనల్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, మరో 10 ప్రోగ్రాం కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది ఎంఎలో ఐదు, 11 పిజి డిప్లొమో కోర్సులు, మూడు సర్ట్ఫికేట్ కోర్సులను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఎంఎ జర్నలిజం కమ్యూనికేషన్, ఎంఎ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎం ఎ సోషల్ వర్కు, ఎంఎ జండర్ స్టడీస్, అర్బన్ ప్లానింగ్, డిజాస్టర్ మేనేజిమెంట్ కోర్సులు ప్రారంభిస్తున్నామని అన్నారు. యూనివర్శిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న పూర్వ విద్యార్ధులను సత్కరించే కార్యక్రమం తలపెట్టినట్టు చెప్పారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సీతారామారావు